ఇక అంతరిక్షంలో యుద్ధం? రష్యా రహస్య ఉపగ్రహం.. అక్కడ దాడులు జరుగుతాయా?

దీన్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ రహస్య 'కాస్మోస్ 2553' ఉపగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో రష్యాలోని ప్లెసెట్స్క్ కాస్మోడ్రోమ్ నుంచి కక్ష్యలోకి సోయుజ్-2 రాకెట్‌తో ప్రవేశపెట్టారు.

భూ కక్ష్య వెలుపలి హద్దుల్లో రష్యాకు చెందిన ఓ రహస్య ఉపగ్రహం తిరుగుతుండడం ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తోంది. రష్యా దీని ద్వారా క్షిపణులను ప్రయోగించేందుకు అంతరిక్ష ఆధారిత ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అక్కడి నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అక్కడి నుంచి లెక్కలేనన్ని కీలక ఉపగ్రహాలను ధ్వంసం చేసే సామర్థ్యం కూడా దానికి ఉంటుంది.

దీన్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ రహస్య ‘కాస్మోస్ 2553’ ఉపగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో రష్యాలోని ప్లెసెట్స్క్ కాస్మోడ్రోమ్ నుంచి కక్ష్యలోకి సోయుజ్-2 రాకెట్‌తో ప్రవేశపెట్టారు. ఉక్రెయిన్‌లోకి దళాలపై దాడి చేయడానికి ముందు ఈ ప్రయోగం చేశారు.

అంతరిక్షంలో రష్యా మోహరించాలనుకుంటున్న ఆయుధానికి చెందిన విడిభాగాలను ఈ ‘కాస్మోస్ 2553’ పరీక్షిస్తున్నట్టు అమెరికా అధికారులు ఓ అంతర్జాతీయ పత్రికకు చెప్పారు. అలాగే, దాని వల్ల ఎదురయ్యే ముప్పును తమ స్పేస్‌ కమాండ్‌ పరిశీలిస్తోందని తెలిపారు.

ఆ ఉపగ్రహం భూమి దిగువ కక్ష్య వెలుపలి హద్దు వద్ద అంటే భూమికి సుమారు 2 కిలోమీటర్ల ఎత్తున ఉంది. అక్కడ వాన్‌ అలెన్‌ బెల్ట్స్‌ నుంచి వచ్చే రేడియో ధార్మికతతో ఇది ఉంటుంది. దీనికి శత్రుదేశాల ఉపగ్రహ భాగాలను నిర్వీర్యం చేసే సామర్థ్యం ఉంటుంది.

KCR : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి- కేసీఆర్ కు మంత్రి పొన్నం ఆహ్వానం