Python Spotted: ఎయిర్‌పోర్ట్ రోడ్డు మీద అడ్డంగా కొండచిలువ

కొచ్చి ఎయిర్‌పోర్టు రోడ్డుపై మెరుపు వేగంతో దూసుకెళ్లే వాహనాలు కొద్ది నిమిషాల పాటు స్తంభించిపోయాయి. ఎటువంటి ట్రాఫిక్ సిగ్నల్ పడకపోయినా వాహనదారులు స్వచ్ఛందంగా ఆగిపోయారు.

Python On Road

Python Spotted: కొచ్చి ఎయిర్‌పోర్టు రోడ్డుపై మెరుపు వేగంతో దూసుకెళ్లే వాహనాలు కొద్ది నిమిషాల పాటు స్తంభించిపోయాయి. ఎటువంటి ట్రాఫిక్ సిగ్నల్ పడకపోయినా వాహనదారులు స్వచ్ఛందంగా ఆగిపోయారు. ఎందుకంటే, రెండు మీటర్ల పొడవున్న కొండచిలువ నిదానంగా రోడ్ దాటుతుండటమే. కేఎస్ఈబీ ఆఫీసు సమీపంలో రాత్రి 11గంటల 10నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది.

కొండచిలువ రోడ్ దాటుతున్నంత సేపు వాహనదారులు సహనంతో ఎదురుచూస్తూ ఉండిపోయారు. చాలా నిదానంగా వెళ్తున్న కొండచిలువకు అలా దాటడానికి నాలుగైదు నిమిషాల సమయం పట్టింది. ఆ పాము ఏ వాహనం చప్పుడుకు భయపడలేదు. వాహనాలు వెళ్తున్నప్పటికీ ముందుకు వెళ్తూనే ఉంది. అలా పొదల్లోకి వెళ్లి క్షణాల్లో కనిపించకుండాపోయింది.

ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అఫీషియల్స్ కథనం ప్రకారం.. ‘సిటీ పరిసరాల్లో కొండచిలువలు ఉన్నాయని వాటిని కాపాడాలంటూ వారిని రెండుమూడు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొచ్చి ప్రాంతం కొండచిలువలకు బాగా అనువైన ప్రదేశం. ఇక్కడ వాటికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది’ అని వెల్లడించారు.

ఇది కూడా చదవండి : తిరుమలలో రేపు వైకుంఠ ఏకాదశి

మూడు.. నాలుగేళ్లుగా కొచ్చి ప్రాంతంలో కొండచిలువలు తరచుగా కనిపిస్తూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.