Vaikunta Ekadasi 2022 : తిరుమలలో రేపు వైకుంఠ ఏకాదశి

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి.  ఇవ్వాళ అర్ధరాత్రి 12 గంటల తరువాత నిత్యసేవలు కైంకర్యాల అనంతరం వేకువజామున  గం. 1:40 కి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ప్రా

Vaikunta Ekadasi 2022 : తిరుమలలో రేపు వైకుంఠ ఏకాదశి

Vaikunta Ekadasi 2022

Updated On : January 12, 2022 / 7:33 AM IST

Vaikunta Ekadasi 2022 :  తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి.  ఇవ్వాళ అర్ధరాత్రి 12 గంటల తరువాత నిత్యసేవలు కైంకర్యాల అనంతరం వేకువజామున  గం. 1:40 కి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ప్రారంభం అవుతుంది.

తొలుత ప్రోటోకాల్ పరిధిలోని విఐపిలను దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రేపు ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వర్ణ రధంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.   ఎల్లుండి ద్వాదశి రోజున ఉదయం 5 నుండి 6 గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.
Also Read : Kodali Nani: వంగవీటి రాధ, కొడాలి నానికి కరోనా..
స్వయంగా వచ్చిన విఐపిలకు మాత్రం శ్రీవారి దర్శనం పాసులు ఇవ్వనున్నట్లు టీటీడీ పేర్కోంది.  స్వయంగా వచ్చిన వీఐపీలకు దర్శనం, వసతి ఏర్పాట్లకు శ్రీ పద్మావతి అతిథి గృహం పరిధిలోని వెంకటకళా, రామ్ రాజ్, సీతా, గోవింద్ సాయి, సన్నిదానం అతిధి గృహాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.