Ramesh Munukuntla Elected as Telugu Alliances of Canada president
Telugu Alliances of Canada: టోరంటోలో జరిగిన ఎన్నికల్లో తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా(TACA) నూతన పాలక వర్గాన్ని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను ఎన్నుకున్నారు. వ్యవస్థాపకుల్లో ఒకరైన రమేష్ మునుకుంట్ల TACA అధ్యక్షులుగా, రమేష్ కూన ట్రస్టీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల 2023-25 కాలానికి ఎన్నికైంది. ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా కల్పన మోటూరి, ఉపాధ్యక్షులుగా రాఘవ్ అల్లం, ప్రధాన కార్యదర్శిగా ప్రసన్నకుమారి తిరుచిరాపల్లి, కోశాధికారిగా మల్లిఖార్జునా చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శిగా అనిత సజ్జ, డైరెక్టర్లు గా విద్య భవణం,ఖాజిల్ మొహమ్మద్, ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, సాయిబోథ్ కట్టా, ఆదిత్యవర్మ, యూత్ డైరెక్టర్లుగా లిఖిత యార్లగడ్డ, రవీంద్ర సామల ఎన్నికయ్యారు.
బోర్డ్ ఆఫ్ ట్రస్టీలుగా విద్యాసాగర్ రెడ్డి,వాణి జయంతి, పవన్ బాసని, శృతి ఏలూరి ఎన్నికయ్యారు. వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ లయం కాగా, వ్యవస్థాపకుల్లో చారి సామంతపూడి, మునాఫ్ అబ్దుల్, శ్రీనాథ్ రెడ్డి కుందూరి, రవి వారణాసి, రామచంద్రరావు దుగ్గిన, లోకేష్ చిల్లకూరు ఉన్నారు.
తెలుగువారి కోసం రెండేళ్లుగా కృషి
తెలుగువారి కోసం రెండు దశాబ్దాలుగా తాకా కృషి చేస్తున్నట్లు రమేష్ మునుకుంట్ల చెప్పారు. సాంస్కృతిక, భాషా, స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కెనడాలోని తెలుగు వారి భావి తరాలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అందజేయడానికి అంకితభావంతో నూతన కమిటీ పని చేస్తుందన్నారు. కెనడా వచ్చే తెలుగు వారితోపాటు భారతీయులు అందరూ ఎటువంటి సమాచారం కావాలన్నా తాకా కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. కమిటీ వివరాలకు తాకా వెబ్ సైట్ teluguassociation.ca ను చూడవచ్చు.
Also Read: 11 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ చెప్పిందే నిజమైంది.. వీడియో వైరల్