Pearl Necklace: వేలంలో రూ.6కోట్లకు అమ్ముడుపోయిన అరుదైన ముత్యాల హారం

అరుదైన ముత్యాలతో కూడిన హారాన్ని వేలం వేయడంతో రూ.6 కోట్ల 24లక్షల 91వేలకు అమ్ముడుపోయింది. సహజసిద్ధంగా ఉప్పు నీటిలో దొరికే ముత్తాలతో పాటు క్రిస్టల్ డిస్క్ లు పొదిగి ఉన్న ముత్యాల హారానికి వజ్రాలను అమర్చారు.

Pearl Necklace: వేలంలో రూ.6కోట్లకు అమ్ముడుపోయిన అరుదైన ముత్యాల హారం

Pearl Necklace

Updated On : June 5, 2022 / 8:26 AM IST

Pearl Necklace: అరుదైన ముత్యాలతో కూడిన హారాన్ని వేలం వేయడంతో రూ.6 కోట్ల 24లక్షల 91వేలకు అమ్ముడుపోయింది. సహజసిద్ధంగా ఉప్పు నీటిలో దొరికే ముత్తాలతో పాటు క్రిస్టల్ డిస్క్ లు పొదిగి ఉన్న ముత్యాల హారానికి వజ్రాలను అమర్చారు. సహజ సిద్ధమైన ఈ ముత్యాలు రెండు రకాల షేడ్స్ లో కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

వింటేజ్ అండ్ హీర్లూమ్ జ్యూయలరీ వారు కొనుగోలు చేసిన ఈ ముత్యాల నగలు.. తర్వాత కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేలం నిర్వహించిన వారు ఈ విషయాన్ని ఘనంగా ప్రచారం చేసుకున్నారు.

ఇక వేలంలో మరో అరుదైన ఐదు వరుసలతో కూడిన ముత్యాల నెక్లెస్ షోకేస్ కు ఉంచారు. దానిని కోటి 48లక్షలకు అమ్మేందుకు నిర్ణయించారు. ఈ నెక్లెస్ 453 గ్రాడ్యుయేట్ నేచురల్ పెర్ల్స్‌తో ఎగ్జిక్యూట్ చేశారు. ఇవి ఈవెన్ టోన్‌తో పాటు చాలా బాగా సరిపోలాయి. నెక్లెస్‌లో వజ్రాలతో సెట్ చేసిన ఆర్ట్ డెకో గోల్డ్ టెర్మినల్స్ ఉన్నాయి.

Read Also: ఇంట్లోనే ముత్యాలు పండిస్తూ లక్షలు సంపాదిస్తున్న రైతు