Snake In Bedroom Ceiling: బెడ్ రూం సీలింగ్‌లో దాక్కున్న కొండచిలువ.. ఆదమరిస్తే అంతే

ఇంట్లోకి పాము దూరిందా.. ఏ కర్ర పెట్టి కొట్టో చంపేయడమో.. చప్పుడు చేసి బెదిరించి పంపేయడమో చేస్తాం. అదే సీలింగ్ లో పడుకుని ఉన్న కొండచిలువ అయితే... చూసిన ఒక్క క్షణం గుండె ఆగిపోవాల్సిందే. తమ ఇంట్లో కనిపించిన కొండచిలువను ముందుగానే గుర్తించి రెస్క్యూ టీంకు ఇన్ఫామ్ చేశారు.

Snake In Bedroom

Snake In Bedroom Ceiling: ఇంట్లోకి పాము దూరిందా.. ఏ కర్ర పెట్టి కొట్టో చంపేయడమో.. చప్పుడు చేసి బెదిరించి పంపేయడమో చేస్తాం. అదే సీలింగ్ లో పడుకుని ఉన్న కొండచిలువ అయితే… చూసిన ఒక్క క్షణం గుండె ఆగిపోవాల్సిందే. తమ ఇంట్లో కనిపించిన కొండచిలువను ముందుగానే గుర్తించి రెస్క్యూ టీంకు ఇన్ఫామ్ చేశారు. వచ్చిన ఆ వ్యక్తి చాకచక్యంగా పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సీలింగ్ లో ఇరుక్కుని ఉన్న పాము మధ్య భాగం మాత్రమే కనబడుతుండటంతో దానిని బయటకు తీయడం సాధ్యం కాలేదు. చాలా సేపు స్టిక్ తీసుకుని దానిని కదిలిస్తుండటంతో ఒక్కసారిగా కిందకు దూకే ప్రయత్నం చేసింది. అలా కిందకు రావడంతోనే విషం చిమ్మేందుకు ప్రయత్నించింది. ఆ వ్యక్తి తప్పుకుని తోక అందిపుచ్చుకున్నాడు.

బుసలు కొడుతూ కాటేసేందుకు ప్రయత్నిస్తున్న పాము మరోసారి అతని కాలును టార్గెట్ చేసింది. కాటేయబోతుండగా తలను వేరే వస్తువుతో తొక్కి పట్టి పట్టుకున్నాడు. తలకింది భాగాన్ని చేతిని అందుకుని ఎట్టకేలకు దానిని అదుపులోకి తీసుకొచ్చాడు. వైరల్ హగ్ అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ అయిన ఈ వీడియోపై మిశ్రమ స్పందన వస్తుంది.

కొందరు పామును పట్టుకున్న తీరును పొగుడుతుంటే.. మరికొందరు పాము ఎంత ప్రమాదకమో చెప్తున్నారు. మిగిలిన వాళ్లు ఘటన జరిగిన ప్రదేశం గురించి మాట్లాడుతున్నాయి. ఫ్లోరిడాలో.. థాయ్ లాండ్ లో.. మలేసియాలో జరిగిందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ రెస్క్యూ టీంను బట్టి చూస్తుంటే ఇది ఇండియాలో జరిగిన ఘటన కాదనేది స్పష్టమవుతోంది.