Mirwais Azizi : అఫ్గాన్ ఆయిల్ బిజినెస్‌ దిగ్గజం..తాలిబన్ల హయాంలోనూ తగ్గేదిలేదంటున్న వ్యాపారి

అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న క్రమంలో ఎంతోమంది వ్యాపారులు దేశం వీడిపోయారు.కానీ అప్గాన్ శ్రీమంతుడు..బిజినెస్ దిగ్గజం ‘మిర్వేజ్ అజీజ్’ తన వ్యాపారాన్ని నిరాటంకంగా..

Mirwais Azizi richest man in Afghanistan : అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక అక్కడి వాతావరణం అంతా తల్లక్రిందులు అయిపోయింది.తాలిబన్లు తాము చెప్పిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమకు ఎదురు తిరిగితే వారికి ఇక కాలం చెల్లిపోయినట్లే. దీంతో ఎంతోమంది దేశం విడిచిపోతున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది వ్యాపారులు కూడా అఫ్గానిస్థాన్ ను వీడియపోయిన పరిస్థితి ఉంది. కానీ అప్గాన్ లో ఓ బిజినెస్ దిగ్గజం మాత్రం అక్కడ తాలిబన్లు ఉంటే నాకేంటీ..ఎవరుంటే నాకేంటీ అన్నట్లుగా తన వ్యాపారాన్ని నిరాటంగా కొనసాగిస్తున్నారు. ఆయనే ద గ్రేట్ అఫ్గాన్ ఆయిల్ బిజినెస్ దిగ్గజం ‘మిర్వేజ్ అజీజ్’.

అఫ్గానిస్థాన్ లో పుట్టి దుబాయ్ నుంచే తన వ్యాపారలను కనుసైగతో నడిపిస్తున్నారు ఆఫ్ఘనిస్థాన్ శ్రీమంతుడు మిర్వేజ్ అజీజ్. కేవలం అఫ్గానిస్థాన్ లోనే కాకుండా మరో 10 దేశాల్లో మిర్వేజ్ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అఫ్గాన్ లో తాలిబన్లు బీభత్సం సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయిల్ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతోంది.

మిర్వేజ్ అజీజ్ అఫ్గానిస్థాన్‌లో ఆయిల్, బ్యాంకింగ్ రంగంలో దిగ్గజం. అఫ్గానిస్థాన్‌లో తిరుగులేని వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. కాబూల్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన మిర్వేజ్ అజీజ్.. వ్యాపారం కోసం 1988లోనే దుబాయ్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. అక్కడి నుంచే ఆయన 10దేశాలకు పైగా ఉన్న ఆయన వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.

మిర్వేజ్ అజీజ్‌ 1962లో ఆఫ్ఘనిస్థాన్‌లోని లఘ్‌మన్ ప్రాంతంలో జన్మించారు. ప్రస్తుతం తాలిబన్లకు ఆఫ్ఘన్‌లో అధికారం రావడంతో చాలామంది వ్యాపారవేత్తలు పారిపోయారు. ఇటువంటి అత్యంత అననుకూల పరిస్థితుల్లో కూడా అజీజ్ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతోంది.

అజీజ్ దుబాయ్‌లో ఉంటూనే అఫ్ఘానిస్థాన్‌లో తన వ్యాపారాన్ని ఏమాత్రం ఆటంకాలు లేకుండా నడిపిస్తున్నారు. 1989లో అజీజ్ గ్రూప్ కంపెనీలను ఆయనే స్థాపించారు. అజీజ్ కంపెనీ బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, సేవా రంగాల్లో కూడా విస్తరించి ఉంది. మంచి లాభాలు ఆర్జిస్తున్నాయి ఆయన వ్యాపారాలన్ని. అఫ్ఘానిస్థాన్‌లో అజీజ్ కు బక్తర్ బ్యాంక్ ఉంది.

అఫ్ఘానిస్థాన్‌కు వచ్చే 70 శాతం ఆయిల్ అజీజ్ కంపెనీ నుంచే వస్తుంది అంటే ఆయన వ్యాపారంలో ఎంతటి చాకచక్యంతా నడిపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తాలిబన్లు కూడా అజీజ్ కంపెనీ ఇంధనాన్నే వినియోగిస్తున్నారు. అజీజ్‌కు చెందిన బ్యాంకులు ఆఫ్ఘన్‌లో 80 బ్రాంబీలు, 110 ఏటీఎంలను కూడా నిర్వహిస్తోంది.

ఇన్ని వ్యాపారాలు చేసే అజీజ్ ఆస్తి 80 మిలియన్ డాలర్లు మన భారత కరెన్సీలో సుమారు రూ. 600 కోట్లు. అజీజ్ వ్యాపారంలో అఫ్ఘానిస్థాన్‌తో పాటు మరో 10 దేశాల్లో నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

అజీబ్ భార్య పరిగుల్. ఈ దంపతులకు ఏడుగురు పిల్లలు. అజీజ్ పిల్లల్లో కొందరు ప్రస్తుతం ఆయన వ్యాపారాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న అజీజ్ 2018లో అరేబియా బిజనెస్ టాప్ 100మంది వ్యాపారవేత్తల్లో చోటు దక్కించుకున్నారు. అఫ్గాన్ లో అత్యంత ధనవంతుడిగా పేరొందారు.

Mirwais Azizi కంపెనీల జాబితా..
అజీజీ హోటక్ జనరల్ ట్రేడింగ్ గ్రూప్
అజీజీ పెట్టుబడులు
అజీజీ డెవలప్‌మెంట్‌లు
అజీజీ బ్యాంక్
బక్తర్ బ్యాంక్ (ఇప్పుడు ఇస్లామిక్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్‌గా)
అజీజీ హాస్పిటాలిటీ
అజీజీ ఫౌండేషన్

ట్రెండింగ్ వార్తలు