కలర్ ఫుల్‌గా బ్రెజిల్ రియో కార్నివాల్

  • Publish Date - February 23, 2020 / 11:23 AM IST

బ్రెజిల్ కార్నివాల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. సాంబ స్కూల్స్ తొలి రోజు ఉత్సాహంగా పరేడ్ చేశాయి. పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కలర్ కలర్ బ్రెజిల్ కార్నివాల్ గ్రాండ్‌గా జరుగుతోంది. వేల సంఖ్యలో డ్యాన్సర్లు అదరగొట్టారు. ఆకట్టుకొనే కాస్ట్యూమ్స్ ధరించి పరేడ్ నిర్వహించారు. 

రియో డి జనెరోకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అతి ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించే నగరంగా..సందడిగా..ఉత్సాహంగా నగరంగా పేరుగడించింది. నగరం పురాతన చరిత్రకు, సాంస్కృతిక వైభవానికి మారుపేరు. రియోగా అందరూ పిలిచే..ఈ నగరం బ్రెజిల్‌లో రెండవ అతిపెద్ద నగరం. దక్షిణ అమెరికాలోనే మూడో పెద్ద మెట్రోపాలిటిన్ నగరం. 1565లో పోర్చుగీస్ రాజు రియో నగరాన్ని స్థాపించిన సందర్భంగా ఈ పేరు పెట్టారు.

రియో నగరానకి ప్రతి ఏటా మూడు మిలియన్‌లకు పైగా అంతర్జాతీయ పర్యాటకులు వస్తుంటారని అంచనా. ఎక్కువ సాంబా నృత్యం నేర్పే స్కూల్ ఫెవేలాస్ ప్రాంతంలో ఉన్నాయి. ప్రపంచంలో జరిగే కార్నివాల్‌లలో రియో నగరంలో జరిగే కార్నివాల్ అతిపెద్దది. ప్రస్తుతం రియో కార్నివాల్ ఘనంగా ప్రారంభమైంది. బ్రెజిలియన్ క్యాలెండర్లలో చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. వీధుల్లో ఆకర్షణీయమైన, వారి సంప్రాదాయ దుస్తులను ధరించి పరేడ్ నిర్వహించారు.

బ్లాక్ పార్టీలతో కార్నివాల్ ప్రారంభం అవుతుంది. అతిపెద్ద వేడుకగా పిలుచుకొనే ఇందులో రియో నగరం అంతటా..వీధి కవాతులు, బ్లాకోలు జరుగుతున్నాయి. ఆధునాతన దుస్తులు ధరించి..కవాతులో పాల్గొంటున్నారు. కళాకారులు, సంగీత విధ్వాంసులు, రచయితలు, ఇతర రంగాలకు చెందిన వారితో కోలాహాలంగా మారింది. 

Read More : కామారెడ్డిలో బైక్‌ల సంత గురించి తెలుసా