Good News : Corona Virus, ఆగస్టు 10 నుంచి వ్యాక్సిన్ పంపిణీ!

  • Publish Date - July 29, 2020 / 02:44 PM IST

Corona Virus కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు దశల వారీగా ప్రయోగాలు జరుపుతున్నారు. రష్యా దేశం కూడా వ్యాక్సిన్ తయారు చేసేందుకు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయి.



సైంటిస్టులు తయారు చేసిన వ్యాక్సిన్ ను అక్కడ సైనికులపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు సెకండ్ వీక్ నుంచి వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు రష్యా రెడీ అవుతోంది. ఇందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. రష్యాలో మాస్కోకు చెందిన గమాలియో ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ ను రూపొందించింది. ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రజలకు పంపిణీ చేయాలని రష్యా భావిస్తోంది.

ప్రపంచమంతా కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ భారీగా కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో రికవరీ రేటు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కరోనా తీవ్రత ఎంతమాత్రం తగ్గడం లేదు. ప్రపంచమంతా ఆసక్తిగా కరోనా వ్యాక్సిన్ కోసమే ఎదురుచూస్తోంది.



2020లో రష్యా దేశీయంగా 30 మిలియన్ మోతాదులను, విదేశాలలో 170 మిలియన్లను తయారు చేయగలదని అంటున్నారు. ఐదు దేశాలు వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడంపై ఆసక్తిని కనబరిచాయి. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారని డిమిత్రివ్ తెలిపారు.

ప్రపంచంలో నాల్గవ అత్యధిక కరోనావైరస్ కేసులు ఉన్న రష్యా, పరీక్షా ప్రక్రియను వేగవంతం చేసింది. వ్యాక్సిన్ పనిచేయడానికి ముందే ఉత్పత్తికి నిధులు సమకూరుస్తోంది. ఔషధ ప్రభావాలను అర్థం చేసుకోవడానికి మూడో దశ ప్రయత్నాలకు కనీసం కొన్ని నెలలు పడుతుందని పరిశోధక బృందం అంచనా వేస్తోంది.


ట్రెండింగ్ వార్తలు