Russia: అణ్వస్త్ర ప్రయోగ పరీక్షలు చేపట్టిన రష్యా.. పుతిన్ ప్రణాళిక ఏమిటి.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చారా?

యుక్రెయిన్ తో వివాదం కొనసాగుతున్న వేళ రష్యా లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అణ్వస్త్ర ప్రయోగ పరీక్షలను రష్యా చేపట్టింది.

Vladimir Putin

Russia conducted Missile Tests : యుక్రెయిన్ తో వివాదం కొనసాగుతున్న వేళ రష్యా లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అణ్వస్త్ర ప్రయోగ పరీక్షలను రష్యా చేపట్టింది. రెండు వారాల్లో మాస్కో నిర్వహించిన రెండో పరీక్ష ఇది. రష్యా భూభాగంలో సుదూర ప్రాంతాలకుసైతం చేరుకునేలా ధీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించేలా యుక్రెయిన్ కు అనుమతి ఇవ్వాలని అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాల దళాలు యోచిస్తున్నాయి. అయితే, అలా జరిగితే మేము ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా హెచ్చరించింది. ఈ క్రమంలో అణ్వాస్త్ర ప్రయోగాలను పరీక్షిస్తూ పశ్చిమాసియా దేశాలకు మాస్కో వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో అణ్వాయుధాల వినియోగాన్ని రష్యా పరీక్షిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా.. మూడు అణ్వస్త్రాలను పరీక్షించిన పుతిన్ సైన్యం.. జలాంతర్గాముల నుంచి రెండు రాకెట్ల ప్రయోగం చేయగా, భూ ఉపరితలం నుంచి మరో రాకెట్ ప్రయోగించింది.

Also Read: Spain floods: స్పెయిన్‌లో వరదల బీభత్సం.. పట్టాలు తప్పిన ట్రైన్.. కొట్టుకుపోయిన కార్లు.. వీడియోలు వైరల్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుక్రెయిన్, ఇతర దేశాల బెదిరింపుల దృష్ట్యా.. ఆధునిక, తక్షణమే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న వ్యూహాత్మక శక్తులను కలిగి ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు అణ్వాయుధాల వినియోగాన్ని నియంత్రించడానికి మేము కట్టుబడి ఉన్నాము. అణ్వాయుధాల ఉపయోగం చాలా అసాధారణమైన చర్య. కానీ, వాటిని ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలని పుతిన్ అన్నారు. మొత్తానికి.. యుక్రెయిన్ కు పెరుగుతున్న పాశ్చాత్య దేశాల మద్దతును అరికట్టడానికి అణ్వాయుధాల ముప్పును తరచుగా బహిర్గతంచేసే పుతిన్.. మంగళవారం రష్యా అణు ఆయుధాగారం.. దేశ సార్వభౌమాధికారం, భద్రతకు నమ్మకమైన హామీదారు అని నొక్కి చెప్పారు

Also Read: Israeli attack : హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు.. 80శాతం రాకెట్లు ధ్వంసం

రష్యా బలగాలు చివరి సారిగా ఈ ఏడాది అక్టోబర్ 18న అణు విన్యాసాలు నిర్వహించాయి. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద అణుశక్తి కలిగిన దేశం. ప్రపంచంలోని అణ్వాయుధాల్లో 88శాతం రష్యా, అమెరికాల వద్దనే ఉన్నాయి. అయితే, యుక్రెయిన్ తో యుద్ధ సమయంలో రష్యా అణువైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ బిల్ బర్న్స్ ప్రకారం.. 2022లో రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించడం గురించి యునైటెడ్ స్టేట్స్ చాలా ఆందోళన చెందింది. అలాంటి ఆయుధాలను ఉపయోగించడం వల్ల కలిగే పరిణామాల గురించి పుతిన్ ను హెచ్చరించిందని తెలిపారు.

 

.