Russia – Ukraine War: యుక్రెయిన్‌పై వ్యాక్యూమ్ బాంబులు వేసినట్లు ఒప్పుకున్న రష్యా

 రష్యన్ మినిష్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తాము యుక్రెయిన్ వ్యాక్యూమ్ బాంబులు వేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు TOS-1A అనే ఆయుధ వ్యవస్థతో దాడి చేసినట్లు ఒప్పుకుంది.

Vaccum Bombs

Russia – Ukraine War: రష్యన్ మినిష్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తాము యుక్రెయిన్ వ్యాక్యూమ్ బాంబులు వేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు TOS-1A అనే ఆయుధ వ్యవస్థతో దాడి చేసినట్లు ఒప్పుకుంది. థర్మోబారిక్ రాకెట్స్ లేదా వ్యాక్యూమ్ బాంబులు వాడి బ్లాస్ట్ లు జరగేలా చేశామని స్పష్టం చేసింది.

అంతకంటే ముందు యుక్రెయిన్ తమ దేశంపై రష్య థర్మోబారిక్ ఆయుధ వ్యవస్థతో దాడి చేశారని అన్నారు. యుక్రెయిన్ లోని యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్ ఒక్సానా మార్కరోవా మాస్కో థర్మోబారికి ఆయుధం వాడారంటూ ఆరోపణలు గుప్పించారు.

‘వాళ్లు వ్యాక్యూమ్ బాంబులతో దాడి చేశారు. యుక్రెయిన్ ను పెద్ద మొత్తంలో నాశనం చేసేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది రష్యా’ అని కామెంట్ చేశారు.

Read Also: రష్యా యుక్రెయిన్ యుద్ధం వలన ఎంత నష్టం జరిగిందంటే!

యుక్రెయిన్ నగరాల్లో రష్యా సృష్టించిన విధ్వసం కారణంగా వందల సంఖ్యలో పౌరులు మరణించడంతో పాటు $100 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.76.29లక్షల కోట్లు) యుద్ధ నష్టం జరిగిందని యుక్రెయిన్ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ నష్టం నుంచి కోలుకునేందుకు యుక్రెయిన్ కు అర్ధ దశాబ్దకాలం పడుతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ముఖ్య ఆర్థిక సలహాదారు ఒలేగ్ ఉస్టెంకో అన్నారు.