Ukraine Russia War : మళ్లీ మొదలైన యుద్ధం.. ఉక్రెయిన్‌పై తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా!

Ukraine Russia War : రష్యా ఉక్రెయిన్‌పై ప్రతీకార దాడికి దిగింది. దక్షిణ ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌పై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించింది.

Russia Fires Intercontinental Ballistic Missile

Ukraine Russia War : రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం మళ్లీ మొదలైంది. దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో కొన్నాళ్లుగా నెమ్మదించిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి కాలుదువ్వుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే రష్యాపై అమెరికా రహిత క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించింది. యుద్ధ వాతావరణం సర్దుమణిగినట్టే అనుకుంటున్న తరుణంలో యుద్ధం మళ్లీ మొదలైంది.

రష్యా గురువారం ఉదయం (నవంబర్ 21) ఉక్రెయిన్‌పై ప్రతీకార దాడికి దిగింది. దక్షిణ ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌పై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించింది. యుద్ధంలో మాస్కో ఇంతటి శక్తివంతమైన, సుదూర క్షిపణిని ఉపయోగించడం ఇదే మొదటిసారి.

ఇప్పటికే వెయ్యి రోజుల పాటు కొనసాగిన యుద్ధంలో ఉక్రెయిన్ ఈ వారం రష్యా భూభాగంలోని సైనికులే లక్ష్యంగా అమెరికా, యూకే తయారు చేసిన క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఈ వైమానిక దాడి జరిపింది. ఇంతకు ముందెన్నడూ యుద్ధంలో ఉపయోగించని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి, సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన డ్నిప్రోలోని క్లిష్టమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం ఈ క్షిపణి ప్రయోగంతో కలిగిన భారీ నష్టాన్ని వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.

రష్యా స్థానాలపై యూకే, యూఎస్ సుదూర క్షిపణులను ప్రయోగించినందుకు ప్రతీకార దాడిగా భారీ కొత్త క్షిపణితో దేశంపై దాడి చేస్తామని క్రెమ్లిన్ బెదిరిస్తోందని ఉక్రేనియన్ మీడియా నివేదించింది. యుద్ధం భయాందోళన నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ సహా పాశ్చాత్య దేశాలు ఇప్పటికే కైవ్‌లోని తమ రాయబార కార్యాలయాలను మూసివేసినట్లు స్టేట్ కాన్సులర్ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఉక్రెయిన్ సరిహద్దులోని కుర్స్క్ ప్రాంతంలో క్షిపణుల శబ్దం తమకు వినిపించిందని నివాసితులు పేర్కొన్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. కనీసం 14 భారీ పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. దూరంగా నల్లటి పొగలు ఆకాశంలోకి పైకి లేచాయి. రాత్రి సమయంలో ఈ క్షిపణిని రష్యా ప్రయోగించింది. డ్నిప్రో నగరాన్ని తాకినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

అయితే, ఏ రకమైన క్షిపణిని ప్రయోగించారో రష్యా వెల్లడించలేదు. ఉక్రెయిన్ వైమానిక దళం టెలిగ్రామ్‌లో రష్యా ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి ఖండాంతర క్షిపణిని ప్రయోగించినట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం వెయ్యి రోజులు దాటింది. వచ్చే జనవరిలో వైట్‌హౌస్‌లో బైడెన్ స్థానంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రానున్నందున ఉక్రెయిన్‌కు భవిష్యత్ సాయంపై ఊహాగానాలు నెలకొన్నాయి.

Read Also : Naga Chaitanya – Sobhita Dhulipala : కాబోయే భర్తతో కలిసి శోభిత.. ఆ ఫిలిం ఫెస్టివల్ లో చైతు ఫ్యామిలీతో..