Naga Chaitanya – Sobhita Dhulipala : కాబోయే భర్తతో కలిసి శోభిత.. ఆ ఫిలిం ఫెస్టివల్ లో చైతు ఫ్యామిలీతో..
తాజాగా గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా 2024 కార్యక్రమం జరుగుతుంది.

Sobhita Dhulipala Attends to International Film Festival of India 2024 Event with Naga Chaitanya and Akkineni Family
Naga Chaitanya – Sobhita Dhulipala : హీరోయిన్ శోభిత ధూళిపాళ త్వరలోనే నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకొని పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. డిసెంబర్ 4 న వీరి పెళ్లి జరగనున్నట్టు సమాచారం. పెళ్ళికి ముందే శోభిత నాగచైతన్య ఇంట్లో జరిగే ఈవెంట్స్ కు, వారికి సంబంధించిన ఈవెంట్స్ కు హాజరవుతుంది. నాగచైతన్య ఫ్యామిలీతో ఈవెంట్స్ లో కనిపించి అలరిస్తుంది.
Also Read : Ram Pothineni : రామ్ కొత్త సినిమా మొదలు.. మిస్టర్ బచ్చన్ భామతో..
తాజాగా గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా 2024 కార్యక్రమం జరుగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు 100 వ జయంతి సందర్భంగా ఈ ఫిలిం ఫెస్టివల్లో ఆయనకు సంబంధించిన పలు క్లాసిక్ సినిమాలను ప్రదర్శించనున్నారు. అలాగే ఆయనకు నివాళులు అర్పించనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి అక్కినేని ఫ్యామిలీ హాజరైంది.
అక్కినేని ఫ్యామిలీతో శోభిత ధూళిపాళ కూడా హాజరైంది. నాగచైతన్యతో శోభిత ధూళిపాళ కలిసి వచ్చింది. అలాగే నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత కలిసి ఉన్న ఫ్యామిలీ ఫొటో కూడా వైరల్ గా మారింది.