Ram Pothineni : రామ్ కొత్త సినిమా మొదలు.. మిస్టర్ బచ్చన్ భామతో..

ఇటీవల డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు టాలీవుడ్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని.

Ram Pothineni : రామ్ కొత్త సినిమా మొదలు.. మిస్టర్ బచ్చన్ భామతో..

Ram Pothineni new movie starts with Mr Bachchan heroine

Updated On : November 21, 2024 / 3:31 PM IST

Ram Pothineni : ఇటీవల డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు టాలీవుడ్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని. ఇక ఈ సినిమా తర్వాత తన తదుపరి సినిమా కూడా స్టార్ట్ చేసేసారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్న మహేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Also Read : Sarangapani Jathakam : సారంగపాణి జాతకం టీజర్ రిలీజ్.. నవ్వించడానికి రెడీ అయిన ప్రియదర్శి..

తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను చిత్ర బృందం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రామ్ పోతినేనితో సహా చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె సైతం ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. డైరెక్టర్ హను రాఘవపూడి ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మిస్టర్ బచ్చన్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటుంది. ఇప్పుడు ఏకంగా రామ్ తో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇకపోతే రామ్ పోతినేని నటిస్తున్న 22వ సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైతం స్టార్ట్ చేయనున్నారట. అందుకు సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే ఇవ్వనున్నారట.