Sarangapani Jathakam : సారంగపాణి జాతకం టీజర్ రిలీజ్.. నవ్వించడానికి రెడీ అయిన ప్రియదర్శి..
టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ యంగ్ యాక్టర్ ప్రియదర్శి లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా సారంగపాణి జాతకం.

Actor Priyadarshi Sarangapani Jatakam movie teaser release
Sarangapani Jathakam : టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ యంగ్ యాక్టర్ ప్రియదర్శి లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇప్పటికే జెంటిల్‌మెన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రూప కొడువాయూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
Also Read : Lady Comedian : ఈ పాప ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు లేడీ కమెడియన్ గా దూసుకుపోతుంది..
అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేయించారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను క్రిస్ట్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చెయ్యనున్నారు. కామెడీ ఎంటర్టైనర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో ప్రియదర్శితో పాటు వెన్నల కిషోర్, హర్ష సైతం పలు కీలక పాత్రల్లో నటించారు.
ఇక విజయ్ దేవరకొండ టీజర్ విడుదల చేసి ‘సారంగపాణి జాతకం’ మూవీ టీమ్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. కచ్చితంగా మీ సినిమా పెద్ద హిట్ అవుతుందన్నారు. ప్రస్తుతం సారంగపాణి జాతకం మూవీ టీజర్ నెట్టింట వైరల్ అవుతుంది. టీజర్ చుసుకుంటే.. సారంగ పాణి జాతకం, జీవితం చుట్టూ తిరిగే ఫన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేక చేతల్లో ఉంటుందా? అన్న నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. టీజర్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి…