Russia Ukraine War Russia Pushes War In Ukraine Close To U.s. Nato Allies' Border With Airstrikes Near Poland As Talks Continue
Russia-Ukraine War : యుక్రెయిన్ అయిపోయింది.. ఇప్పుడు నాటో దేశాలపై పడింది పుతిన్ కన్ను. యుక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన దగ్గర్నుంచి.. ఏదో ఒక ఆటంకం సృష్టిస్తున్న అమెరికా, నాటో దేశాలపై గుర్రుగా ఉన్న పుతిన్.. యుక్రెయిన్‌కు ఇప్పుడు ఆయుధాలు పంపుతుండడంతో.. నాటో దేశమైన పోలండ్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. యుక్రెయిన్, పోలండ్ బార్డర్‌లో బాంబుల మోత మోగిస్తూ.. వార్నింగ్ ఇస్తున్నారు. పోలండ్‌పై దాడి చేసి నాటోను రంగంలోకి దించేందుకు పుతిన్ పావులు కదుపుతున్నాడు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు యుక్రెయిన్ యుద్ధాన్ని ఇప్పట్లో ముగించడం ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. అసలు యుద్ధంలో పుతిన్ ఏ వ్యూహం అనుసరిస్తున్నారు.. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనడం మినహా చేయాల్సినవన్నీ చేస్తున్న అమెరికా, నాటో దేశాలను ప్రత్యక్ష యుద్ధంలోకి దించేందుకు వ్యూహప్రతివ్యూహాలను రచిస్తున్నారు. థర్డ్ వరల్డ్ వార్‌కి సిద్ధంగా లేని నాటో దేశాలను, యుక్రెయిన్‌కు మధ్య మరింత దూరం పెంచేందుకు కొత్త స్ర్టాటజీని అమలు చేస్తున్నారు. నాటో, అమెరికా నుంచి ఆయుధాల, రష్యాపై ఆంక్షల రూపంలో అందుతున్న పరోక్ష సాయాన్ని నిలిపివేసేలా చేసేందుకు రివర్స్ గేర్ వేసాడు పుతిన్.
పోలండ్‌కు సమీపంలోని లీవ్ నగరంలో కీలక మిలటరీ బేస్‌పై రష్యా జరిపిన దాడులను చూస్తుంటే పుతిన్ ప్లాన్ ఏంటో తెలుస్తోంది. యుక్రెయిన్‌కు మద్దతుగా ఆయుధాలు అందించిన వారినీ లక్ష్యంగా చేసుకుంటామని రష్యా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ దాడి జరిగింది. నాటో దేశాలు ప్రత్యక్ష్యంగా యుద్ధంలో పాల్గొనడం… లేదంటే.. యుక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేయడం.. ఏదో ఒకటి జరిపించడం ద్వారా యుద్ధం సాగుతున్న స్థితిని మార్చాలన్నది పుతిన్ స్ర్టాటజీ. దాన్నే అమలుచేస్తూ.. పోలండ్ సరిహద్దు వరకూ వెళ్లారు.
Russia Ukraine War Russia Pushes War In Ukraine Close To U.s. Nato Allies’ Border With Airstrikes Near Poland As Talks Continue
పుతిన్ ఊహించినట్టే నాటోలో భాగమైన పోలండ్ సమీపంలో జరిగిన దాడిపై పాశ్చాత్య దేశాలు తీవ్రంగా స్పందించాయి. పొరపాటుగా అయినా నాటో దేశాలపై చిన్నస్థాయి దాడి జరిగినా నాటో పూర్తిస్థాయిలో ప్రతిస్పందిస్తుందని బ్రిటన్, అమెరికా వార్నింగ్ ఇచ్చాయి. ఇప్పటికే యుక్రెయిన్‌లో రష్యా జీవాయుధాలు ప్రయోగించే ప్రమాదముందని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడు పోలండ్ సరిహద్దుల్లో వైమానిక దాడులు జరపడంతో.. నాటో దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు స్పష్టమవుతోంది.
Read Also : NATO Refuse : యుక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న జెలెన్‌స్కీ.. నో చెప్పిన నాటో