Russia Temporary Ceasefire Airstrike In Sumy Near Hostel Of Indian Students; Russia's Temporary Ceasefire Begins In Mariupol
Russia Temporary Ceasefire : యుక్రెయిన్ రష్యా యుద్ధంలో పదో రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. యుక్రెయిన్ ప్రజలు, విదేశీయులు సురక్షితంగా దేశం దాటేందుకు వీలుగా కాల్పుల విరమణ ప్రకటించినట్టు తెలిపింది. దాదాపు ఐదున్నర గంటల పాటు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉండనుందని రష్యా ప్రకటించింది. యుక్రెయిన్ రెండు నగరాల్లో రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. మరియుపోల్, వోల్నోవఖా ప్రాంతాల్లో కాల్పులను విరమించినట్టు ప్రకటించింది. ఇదే సమయంలో సివిల్ కారిడర్ల ఏర్పాటుకు రెండో విడత చర్చలో ఒప్పందం కుదిరింది. వోల్నోవఖా ప్రాంతంలో మరో సివిల్ కారిడార్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది.
రష్యా ప్రకటించిన నగరాలతో భారతీయులకు ప్రయోజనం శూన్యంగా కనిపిస్తోంది. భారతీయులు ఎక్కువగా లేని ప్రాంతాల్లోనే కాల్పులను విరమించింది. సుమిలో కాల్పుల విరమణను భారత్ కోరింది. సుమిలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు కేంద్రం భరోసా కల్పిస్తోంది. విద్యార్థుల తరలింపునకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. సుమి నుంచి తరలించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆపరేషన్ గంగ పూర్తయ్యే వరకు కంట్రోల్ రూమ్స్ పనిచేస్తాయని కేంద్రం తెలిపింది. సుమిలో కాల్పుల విరమణ ప్రకటించాలని రష్యాను కేంద్రం కోరింది. సుమిలో సాయం కోసం వెయ్యి మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రష్యా సరిహద్దు ప్రాంతం కావడంతో సుమిలో భీకరంగా యుద్ధం కొనసాగుతోంది.
మెడిసిన్ చదివేందుకు యుక్రెయిన్ వెళ్లి యుద్ధంలో చిక్కకుపోయిన వేలాదిమంది భారత విద్యార్ధులను ‘ఆపరేషన్ గంగ’ ద్వారా కేంద్రం సురక్షితంగా తరలిస్తోంది. ఇప్పటికే ఎంతోమందిని స్వదేశానికి తరలించింది. కానీ రష్యా-యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న సుమి యూనివర్శిటీలో చదువుకుంటున్న భారత్ విద్యార్దులకు తరలించటం సాధ్యపడటం లేదు. సుమి నగరం రష్యా సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడ కాల్పులను విరమించలేదు. సుమిలో భారత్‌కు చెందిన 1000మంది విద్యార్ధులు యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతంలో ‘ఆపరేషన్ గంగ’ సాధ్యంకావడం లేదని అధికారులు అంటున్నారు. సుమి యూనివర్శిటీ సమీపంలోనూ, వర్శిటీకి చెందిన హాస్టల్స్ సమీపంలోని రష్యా బాంబు దాడులు జరుగుతుండటంతో అక్కడ చిక్కుకున్న విద్యార్ధుల భద్రత గురించి ఆందోళన నెలకొంది.
Russia Temporary Ceasefire : కాల్పుల విరమణతోనే విద్యార్థుల తరలింపు సాధ్యం..
రష్యా భీకర దాడుల్లో తూర్పు యుక్రెయిన్ ప్రాంతంలో కనీసం 1,000 మంది భారతీయులు చిక్కుకుపోయారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఖార్కివ్‌లో 300, సుమీలో 700 మంది భారత పౌరులు ఉన్నారని తెలిపింది. వారిని ఎలాగైనా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని స్పష్టం చేసింది. వీరి తరలింపు సవాల్‌గా మారిందని పేర్కొంది. ఈ అంశంపై యుక్రెయిన్, రష్యా దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
చివరి భారతీయుడ్ని సురక్షితంగా తరలించే వరకూ ఆపరేషన్ గంగ కొనసాగుతుందని వెల్లడించారు. సుమారు 2 నుంచి 3 వేల మంది యుక్రెయిన్‌లో చిక్కుకున్నారని తెలిపారు. తూర్పు యుక్రెయిన్‌లోని ప్రాంతాల్లో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించడంపైనే దృష్టి సారించినట్టు చెప్పారు. భారతీయుల తరలింపు విషయంలో సహకరించాలని రష్యా, యుక్రెయిన్‌లతో సంప్రదింపులు జరుపుతున్నామని, కాల్పులు విరమణ జరిగతేనే సాధ్యమవుతుంది అని బాగ్చి తెలిపారు.
యక్రెయిన్‌లో ఈ ఉదయం 11.30 నుంచి కాల్పులను విరమించినట్టు రష్యా ప్రకటించింది. మానవతాధృక్పథంతో కాల్పుల విరమణిస్తున్నట్టు రష్యా వెల్లడించింది. యుద్ధక్షేత్రంలో సామాన్యులు దేశం దాటేందుకు వీలుగా కాల్పులను విరమణకు అంగీకరించినట్టు తెలిపింది. యుద్ధాన్ని ప్రారంభించిన 10వ రోజు కాల్పుల విరమణను ప్రకటించింది. యుద్ధంలో సామాన్యులు బలికాకుండా ఉండేందుకు కాల్పుల విరమణను ప్రకటించినట్టు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది.
Read Also : Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ బోర్డర్ లోని సుమిలో చిక్కుకున్న 1000మంది భారత్ విద్యార్ధులు