Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ బోర్డర్ లోని సుమిలో చిక్కుకున్న 1000మంది భారత్ విద్యార్ధులు

రష్యా-యుక్రెయిన్ సరిహద్దులోని సుమిలో 1000మంది భారత్ విద్యార్ధులు చిక్కుకున్నారు. రష్యా సరిహద్దు కావటంతో ఆపరేషన్ గంగ ద్వారా వారిని తీసుకురావటానికి వీల్లేకుండా ఉంది. దీంతో వారి భద్రత

Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ బోర్డర్ లోని సుమిలో చిక్కుకున్న 1000మంది భారత్ విద్యార్ధులు

1,000 Indians Still In Ukraine Warzones Sumy, Kharkiv Says Centre Govt

1,000 indians still in ukraine warzones sumy, kharkiv says centre Govt : వైద్య విద్య కోసం యుక్రెయిన్ వెళ్లి యుద్ధంలో చిక్కకుపోయిన వేలాదిమంది భారత విద్యార్ధులను ‘ఆపరేషన్ గంగ’ద్వారా కేంద్రం సురక్షితంగా తీసుకువస్తోంది. ఇప్పటికే ఎంతోమందిని తీసుకొచ్చారు. కానీ రష్యా-యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న సుమి యూనివర్శిటీలో చదువుకుంటున్న భారత్ విద్యార్దులకు తరలించటం సాధ్యం కావటంలేదు. ఈ క్రమంలో సుమిలో భారత్ కు చెందిన 1000మంది విద్యార్ధులు యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతంలో ‘ఆపరేషన్ గంగ’సాధ్యంకాకపోవటంతో వారు అక్కడ ఉండలేక భారత్ రాలేక తినటానికి ఆహారం..తాగటానికి నీరు లేక అల్లాడిపోతున్నారు. అక్కడ మంచునే బాటిల్స్ లో పట్టుకుని తాగి జీవిస్తున్న అత్యంత దారుణ పరిస్థితులకు గురవుతన్నారు భారత్ విద్యార్థులు. సుమి యూనివర్శిటీ సమీపంలోను..వర్శిటీకి చెందిన హాస్టల్స్ సమీపంలోని రష్యా బాంబు దాడులు జరుగుతుండటంతో అక్కడ చిక్కుకున్న విద్యార్ధుల భద్రత గురించి ఆందోళన నెలకొంది.

Also read : Russia-Ukraine War : యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థులకు గుడ్ న్యూస్ NMC కీలక ప్రకటన

రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలో కనీసం 1,000 మంది భారతీయులు చిక్కుకుపోయారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఖార్కివ్‌‌లో 300, సుమీలో 700 మంది భారత పౌరులు ఉన్నారని తెలిపింది. వారిని ఎలాగైనా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని స్పష్టం చేసింది. వీరి తరలింపు సవాల్‌గా మారిందని పేర్కొంది. ఈ అంశంపై ఉక్రెయిన్‌, రష్యా దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు.

ఈ సందర్భంగా బాగ్చి మాట్లాడుతూ..‘‘చివరి భారతీయుడ్ని సురక్షితంగా తరలించే వరకూ ఆపరేషన్ గంగ కొనసాగుతుంది అని వెల్లడించారు.సుమారు 2 నుంచి 3 వేల మంది ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు..తూర్పు ఉక్రెయిన్‌లోని ప్రాంతాల్లో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించడంపైనే దృష్టి సారించామని తెలిపారు ఈ విషయంలో సహకరించాలని రష్యా, ఉక్రెయిన్‌లతో సంప్రదింపులు జరుపుతున్నామని… కాల్పులు విరమణ జరిగతేనే ఇది సాధ్యమవుతుంది అని బాగ్చి తెలిపారు.

Also read : Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ యుద్ధం వేళ..రంగంలోకి దిగిన కమలా హారిస్‌..

సుమీ స్టేట్ యూనివర్శిటీలో చిక్కుకుపోయిన భారతీయ వైద్య విద్యార్థులు సహాయం కోసం అభ్యర్ధిస్తూ వీడియోను విడుదల చేసారు. 1000 మందికి హాస్టళ్లలో చిక్కుకుని ఆహారం, నీరు లేకుండా ఆకలితో అలమటిస్తున్నామని, బయట కాల్పులు, దాడులు, గడ్డకట్టే చలి వల్ల బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

‘‘ప్రభుత్వం సహాయం చేస్తుందని మేము ఆశగా ఎదురు చూస్తున్నాం.. కానీ మాకు ఎటువంటి సమాచారం లేదని..ఇక్కడ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా సరిహద్దులో బస్సులు ఉన్నాయని కొందరు చెబుతున్నారు..మేము హాస్టల్ నుంచి బయటకు వస్తే ప్రతిచోటా స్నిప్పర్లు ఉన్నారు..దాడులు జరుగుతున్నాయి..దాడులకు భయపడుతున్నాం..ప్రతి 20 నిమిషాలకు బాంబు పేలుడు జరుగుతోంది’’ అని విద్యార్ధులు భయం భయంగా వీడియో ద్వారా వాపోయారు.

Also read : Operation Ganga : కొనసాగుతున్న ఆపరేషన్ గంగ.. 50 విమానాల్లో చేరుకున్న 11వేల మంది భారతీయులు

‘అలాగే మేము ప్రధాని మోడీని వేడుకుంటున్నాం..దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లండి.. లేకుంటే మమ్మల్ని చచ్చిపోతామనే భయంవేస్తోంది.భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం, దయచేసి మాకు సహాయం చేయండి.. ఆహారం, నీరు లేదు. టాయ్‌లెట్‌ వెళ్లాలన్నా నీరు లేదు. గత రాత్రి నుంచి చాలా మందికి తాగడానికి నీరు అందలేదు.. మేము చాలా ఆందోళన చెందుతున్నాం’’ అని వీడియోలో అభ్యర్థిస్తున్నారు.

కాగా..ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు తరలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 48 ప్రత్యేక విమానాల్లో 10,300 మందిని స్వదేశానికి తీసుకువచ్చామని భారత విదేశాంగశాఖ వెల్లడించింది.