Russia-Ukraine War : యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థులకు గుడ్ న్యూస్

యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ (NMC) గుడ్ న్యూస్ చెప్పింది.

Russia-Ukraine War : యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థులకు గుడ్ న్యూస్

National Medical Commission Allows Foreign Medical Graduates With Incomplete Internships In India

Russia-Ukraine War : యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ (NMC) గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా, యుక్రెయిన్‌పై యుద్దం తలపెట్టినప్పటినుంచి తీవ్ర ఆందోళనలో పడిపోయిన వైద్య విద్యార్ధులు యుక్రెయిన్ లో ఉండలేక..భారతదేశం రాలేక నానా పాట్లు పడ్డారు. ఓ పక్క చదవుపూర్తి కాకుండా వస్తే పరిస్థితి ఏమిటి? ఇంకో పక్క ఈ యుద్ధం ఎప్పటికి ఆగుతుంది? తమ చదవు తిరిగి ఎప్పటికి కొనసాగుతుంది?అసలు పూర్తి అవుతుందా? లేకుంటే తమ పరిస్థితి ఏంటీ? భవిష్యత్తు ఏంటీ అనే ఆందోళనతో వెన్నాడుతున్న వేళ అక్కడ ఉండలేక..భారత్ తిరిగి రాలేక నానా కష్టాలు పడ్డారు. ఈక్రమంలో చాలామంది విద్యార్ధులు అక్కడి యుద్ధం పరిస్థితులు చక్కబడేలా లేవని..ఏది ఏమైనా స్వదేశానికి వచ్చేయాలని నిర్ణయించుకుని భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ద్వారా స్వదేశానికి చేరుకున్నారు.కానీ తమ చదువు గురించి ఆందోళన మాత్రం పోలేదు. యుక్రెయిన్ లో మెడిసిన్ పూర్తి కాలేదు. అలాగని భారత్ తో తిరిగి మొదటినుంచి చదువును ప్రారంభించలేరు.

Also read : Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ యుద్ధం వేళ..రంగంలోకి దిగిన కమలా హారిస్‌..

ఈ క్రమంలో జాతీయ మెడికల్ కమిషన్ (NMC) కీలక నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ సంక్షోభం కారణంగా మెడిసిన్‌ చదువు మధ్యలో ఆగిపోతుందనే ఆందోళనలు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వారికి ఊరట కలిగించేలా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19, యుద్ధం వంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటర్న్‌షిప్‌కు ఆటంకం ఏర్పడిన విదేశాల్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు భారత్‌లో ఆ విద్యను పూర్తి చేయడానికి అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి శనివారం (మార్చి5,2022) ఉదయం ఎన్ఎంసీ ఉత్తర్వులు వెలువరించింది.

ఈ సర్క్యులర్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న “వేదన, ఒత్తిడి”ని పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించినట్లయితే, వారి దరఖాస్తులను రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లు ప్రాసెస్ చేయవచ్చు అని పేర్కొంది. అంటే భారతదేశంలో ఇంటర్న్‌షిప్ చేసుకోవటానికి వీలు కల్పించింది.

Also read :Ukraine no fly Zone : యుక్రెయిన్‌పై నో ఫ్లై జోన్ ఏర్పాటుకు నాటో తిరస్కరణ.. జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం..!

ఈ క్రమంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE)ని భారతదేశంలో నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు క్లియర్ చేయాలని నిర్ధారించుకోవాలి. అభ్యర్థి ప్రమాణాలను నెరవేర్చినట్లు గుర్తిస్తే, తాత్కాలిక రిజిస్ట్రేషన్ మంజూరు చేయబడవచ్చు రాష్ట్ర వైద్య మండలి 12 నెలల ఇంటర్న్‌షిప్ లేదా బ్యాలెన్స్ పీరియడ్ కోసం, సందర్భానుసారంగా ఉండవచ్చు” అని సర్క్యులర్‌లో పేర్కొంది.విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు (FMGలు) తమ ఇంటర్న్‌షిప్ చేయడానికి అనుమతించినందుకు వారి నుండి ఎటువంటి ఫీజులు వసూలు చేయరని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లు మెడికల్ కాలేజీ నుండి హామీని పొందాలని NMC తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నిబంధనలు సడలించిన ఎన్‌ఎంసీ.. భారత్‌లో వైద్య విద్యను పూర్తిచేసేందుకు వీలు కల్పించింది. జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్) (FMGE) – 2021 నిబంధనల ప్రకారం, విదేశాల్లో మెడిసిన్‌ చదివే విద్యార్థులు కోర్సు, ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్‌ కూడా అక్కడే పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాథమికంగా వైద్యవిద్య ఎక్కడ అవుతుందో మిగిలినవి కూడా పూర్తి చేయాలి. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం మెడిసిన్‌ మధ్యలో స్వదేశానికి వచ్చి ఇక్కడ కోర్సు పూర్తి చేసేందుకు ప్రస్తుత నిబంధనలు అనుకూలించవు.

Also read : Operation Ganga : కొనసాగుతున్న ఆపరేషన్ గంగ.. 50 విమానాల్లో చేరుకున్న 11వేల మంది భారతీయులు

కానీ పరిస్థితిలు తల్లక్రిందులయ్యాయి. వైద్య విద్యార్ధుల ఆశలపై రష్యా.. యుక్రెయిన్ యుద్ధం నీళ్లు చల్లింది. దీంతో విద్యార్ధులు ఆందోళనలో పడిపోయారు. యుక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడ మెడిసిన్‌ చదువుతోన్న భారతీయ విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఎన్‌ఎంసీలో నిబంధనలు సడలించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో కోర్సు పూర్తయ్యేందుకు వెసులుబాటు కల్పించారు.

కాగా..యుక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు. మరో రెండేళ్లు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. భారత్‌తో పోలిస్తే యుక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ కోర్సుకు అయ్యే ఖర్చు చాలా తక్కువే. అందుకే ఏటా వేలాది మంది భారత్‌ నుంచి ఉక్రెయిన్‌కు వైద్య విద్య కోసం వెళ్తారు.