ప్రపంచంలోనే పవర్ ఫుల్ మిసైల్ టెస్ట్ చేసిన రష్యా.. అదో సాతాను 2 అంటున్న వెస్ట్రన్ కంట్రీస్.. ఏంటి దీని ప్రత్యేకత?
ప్రస్తుతం తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. 2026 చివరి నాటికి పూర్తి స్థాయిలో సర్మాట్ మిస్సైల్ అందుబాటులోకి రానుంది.
- Naveen
- Updated on- May 14, 2026 / 07:26 PM IST
Russia Missile Test: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాలు వెంటాడుతున్నాయి. ఇరాన్ పై అటాక్స్ కు రెడీ అవుతున్నట్లు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు మరింత టెన్షన్ పెంచుతున్నాయి. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా కొత్త మిస్సైల్ ను టెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ మిస్సైల్ పేరు సర్మాట్ ICBM. న్యూక్లియర్ వార్ హెడ్స్ ను తీసుకెళ్లగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ మిసైల్ గా పేరు ఉంది. ఈ మిస్సైల్ ఖండాంతర లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఏకబిగిన 35వేల కిలోమీటర్లు వెళ్లగల సామర్థ్యం కలిగుంది.
ప్రపంచంలో ఉన్న అత్యంత పవర్ ఫుల్ మిసైళ్ల కంటే నాలుగు రెట్ల అధిక సామర్థ్యం ఉంది. వెస్ట్రన్ కంట్రీస్ దీన్ని సాతాను 2గా అభివర్ణిస్తున్నాయి. దీనికి ఎదురులేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా దగ్గర మరో రెండు మిసైల్స్ కూడా ఉన్నాయి. అవే కింజల్, అవంగర్డ్ మిసైల్స్. ఇప్పుడు రష్యా టెస్ట్ చేసిన మిస్సైల్ వీటికంటే పవర్ ఫుల్.
2018లో సర్మాట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది రష్యా. 2022 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కాగా, 2026కి పూర్తి చేశారు సైంటిస్టులు. ప్రస్తుతం తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. 2026 చివరి నాటికి పూర్తి స్థాయిలో సర్మాట్ మిస్సైల్ అందుబాటులోకి రానుంది.
అమెరికాతో తమ అణ్వాయుధాలను పరిమితం చేసే చివరి ఒప్పందం గడువు ముగిసిన కొన్ని నెలల తర్వాత.. అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న “అత్యంత శక్తివంతమైన క్షిపణి వ్యవస్థ” సర్మాట్ ఐసీబీఎంను రష్యా పరీక్షించింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) సర్మాట్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు నివేదిక అందిన అనంతరం, “ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణి వ్యవస్థ,” అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు దీన్ని “సాతాన్ 2” అని పిలుస్తాయి.
రష్యా తదుపరి తరం క్షిపణులలో ఇదొకటి. రష్యా దగ్గర ఇప్పటికే కింజల్, అవంగార్డ్ హైపర్‌సోనిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. పాశ్చాత్య సైన్యాల వద్ద ఉన్న వాటి కంటే నాలుగు రెట్ల కంటే ఎక్కువ శక్తివంతమైన వార్‌హెడ్‌ను ఈ క్షిపణి మోయగలదని, అలాగే ఈ ఏడాది చివరి నాటికి సర్మాట్ యుద్ధ విధుల్లో ఉంటుందని పుతిన్ తెలిపారు.
Also Read: చైనాలో ట్రంప్.. ఇండియాకి వచ్చే లాభమేంటి? నష్టమేంటి?
