Call Centre Scam: రష్యాలో భారీ స్కామ్ గుట్టురట్టు.. ఇండియన్స్ సహా లక్షలాది మంది బాధితులు..

నకిలీ పెట్టుబడుల పేరుతో లక్షల మంది నుంచి కోట్లు కొల్లగొతున్న కాల్ సెంటర్ల ముఠా గుట్టును రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) వెలుగులోకి తీసుకొచ్చింది.

Global Call Centre Scam

Global Call Centre Scam: నకిలీ పెట్టుబడుల పేరుతో లక్షల మంది నుంచి కోట్లు కొల్లగొతున్న కాల్ సెంటర్ల ముఠా గుట్టును రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) వెలుగులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో నడిచిన ఈ నెట్ వర్క్ ద్వారా లక్ష మందికిపైగా ప్రజలు మోసపోయారు. వీరిలో భారత్ సహా దాదాపు 50కిపైగా దేశాలకు చెందిన బాధితులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ మోసాల గురించి పెరుగుతున్న ఆందోళనను ఈ ఆపరేషన్ హైలెట్ చేంది. గ్లోబల్ స్థాయిలో జరుగుతున్న ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉన్న కొందరిని రష్యా ఎఫ్ఎస్బీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాతో లండన్ లో నివాసముండే జార్జియా మాజీ రక్షణ మంత్రి డి కజెరాశ్ విలితో సంబంధాలున్నట్లు వెల్లడైంది.

Also Read: Shah Rukh Khan-Aryan Khan : తండ్రీ కొడుకుల విస్కీ బిజినెస్.. వరల్డ్ లోనే బెస్ట్ బ్రాండ్ గా.. రేటెంతో తెలుసా..

ముఖ్యంగా భారతదేశం పెట్టుబడి ప్లాట్ ఫారమ్ లకు, డిజిటల్ లావాదేవీలకు ప్రపంచలోనే అతిపెద్ద మార్కెట్ లలో ఒకటి గా ఉంది. దీంతో ఈ స్కామ్ మూలాలు భారత్ లోనూ విస్తృతంగా వ్యాపించాయి. కాల్ సెంటర్ల ఆపరేటర్లు పెట్టుబడుల స్కీమ్ లు అని చెప్పి భారీ లాభాలు ఆశచూపుతూ ప్రజలను మోసగిస్తున్నారు. రష్యా ఎఫ్ఎస్బీ గుట్టురట్టు చేసిన ఈ కాల్ సెంటర్ల ద్వారా భారత్ సహా ఐరోపా సమాఖ్య, యూకే, కెనడా, బ్రెజిల్, జపాన్ వంటి దేశాల ప్రజలను మోసగించి రోజుకు కనీసం ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8కోట్లు) వరకు ఈ ముఠా దోపిడీకి పాల్పడుతుందని అధికారులు గుర్తించారు.

 

ముఖ్యంగా స్కామర్లు సాంకేతికతను సద్వినియోగం చేసుకొని బలహీన ప్రజలను టార్గెట్ గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు బాధితుల ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఎస్బీ దర్యాప్తు ప్రారంభించడంతో ఈ భారీ సైబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ భారీ స్కామ్ సూత్రధారులుగా ఉన్న ఇజ్రాయెలీ, జార్జియన్ పౌరులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.