Russia Ukraine Crisis Couple Marry At Monastery In Kyiv Amid Air Raid Sirens (1)
Russia-Ukraine Crisis : ఒకవైపు రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధ జరుగుతోంది. ప్రపంచమంతా భయాందోళన వ్యక్తం చేస్తోంది. బాంబుల వర్షం కురుస్తోంది.. వైమానిక దాడుల సైరన్ల మోత మధ్య పెళ్లి ప్రమాణాలతో ఓ జంట ఒక్కటైంది. అంతా బాగుంటే అనుకున్నట్టుగానే అంగరంగ వైభంగా పెళ్లి చేసుకునేవారే. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోంది. ఎప్పుడు ఏమౌతుందో ఏంటో.. అసలు జీవించి ఉంటామో లేదో.. అన్న ఆందోళన వారిలో మొదలైంది. అందుకే తమ పెళ్లిని యుద్ధం మొదలైన రోజునే చేసుకోవాలని నిర్ణయించుకుంది ఈ జంట.
అదే రోజు పెళ్లి చేసుకుని ఒకటవ్వాలనుకుంది. వాస్తవానికి మేలో ఉక్రేనియన్ రాజధాని కైవ్‌లో ప్రశాంతమైన నది పక్కన, అందమైన లైట్లతో రెస్టారెంట్ టెర్రస్‌పై ఘనంగా పెళ్లి చేసుకోవాలని ఈ జంట ముచ్చటపడింది. రష్యాలోని వాల్డై హిల్స్‌లో 21ఏళ్ల యారీనా అరివా (Yaryna Arieva) ఆమె భాగస్వామి స్వ్యటోస్లావ్ ఫర్సిన్ (Svyatoslav Fursin) వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఒకవైపు యుద్ధం జరుగుతుండగా.. చెవుల్లో మోగుతున్న వైమానిక దాడుల సైరన్ల మధ్య ఈ జంట రింగులు మార్చుకుని ఒకటైంది. యువతి యారీనా అరీవా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సిటీ కౌన్సిల్‌లో డిప్యూటీగా పని చేస్తోంది.
కుటుంబ సభ్యులు నిశ్చయించిన ప్రకారం.. తన ఫియాన్సీ శివాటోస్లావ్‌తో మే 6న వివాహం జరగాల్సి ఉంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలుకావడంతో ఎక్కడ ఏ బాంబు పడుతుందో? ఎవరు ఎప్పుడు మరణిస్తారోనన్న భయాందోళన నెలకొంది. ఈ బాంబుదాడుల్లో మేమిద్దరం చనిపోవచ్చు.. అలా జరగడానికి ముందే పెళ్లిబంధంతో ఒక్కటి కావాలనుకున్నామని యారీనా చెప్పుకొచ్చింది. ఈ జంట రింగులు మార్చుకుని ప్రమాణాలతో ఒక్కటైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రకటించారు. వరుస క్షిపణి దాడులతో యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురుస్తోంది. రెండవ రోజున, రష్యా దళాలు ఉక్రెయిన్‌లోకి లోతుగా దూసుకెళ్లాయి. కైవ్‌లో పేలుళ్లు వినిపించాయి. వివాహం అనంతరం ఈ జంట తన దేశాన్ని రక్షించుకునేందుకు తోటి పౌరులతో కలిసి స్థానిక ప్రాదేశిక రక్షణ కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమైంది. మనం ప్రేమించే ప్రజలను.. మనం నివసించే భూమిని మనం రక్షించుకోవాలని జంట తెలిపింది.
Read Also : Russia-Ukraine War : చర్చలకు జెలెన్‌స్కీ ప్రతిపాదన.. ప్రతినిధుల బృందాన్ని పంపేందుకు పుతిన్ రెడీ..!