Russia-Ukraine War : సీ ఆఫ్ అజోవ్‌ సముద్రంలో ప్రవేశాన్ని తాత్కాలికంగా కోల్పోయిన యుక్రెయిన్

Russia-Ukraine War : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర నాలుగు వారాలుగా కొనసాగుతూనే ఉంది.

Russia-Ukraine War : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర నాలుగు వారాలుగా కొనసాగుతూనే ఉంది. రష్యా బలగాల దాడులను దీటుగా యుక్రెయిన్ సైన్యం ఎదుర్కొంటోంది. యుక్రెయిన్‌కు సంబంధించి అన్నింటిపై రష్యా నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్ ప్రధాన నగర సరిహద్దుల్లో రష్యా తమ నియంత్రణలోకి తీసుకుంది. ఇప్పుడు యుక్రెయిన్ అవసరాలను తీర్చే సీ ఆఫ్ అజోవ్ సముద్రంలో ప్రవేశానికి కూడా అనుమతి లేకుండా చేసింది రష్యా. ఈ సముద్రం రష్యా నియంత్రణలో ఉంది. ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అజోవ్ సముద్రంలోకి ప్రవేశాన్ని యుక్రెయిన్ తాత్కాలికంగా కోల్పోయినట్టు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

రష్యా దళాలు యుక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలన్నింటిని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్ సముద్రపు ప్రధాన నౌకాశ్రయమైన మారియుపోల్ చుట్టూ రష్యా బలగాలు పట్టుబిగించాయి. ఈ క్రమంలోనే సీ ఆఫ్ అజోవ్ ప్రవేశానికి యుక్రెయిన్ తాత్కాలికంగా కోల్పోయింది. రష్యన్ దళాలు డోనెట్స్క్ ప్రాంత జిల్లాను ఆక్రమించడంలో పాక్షికంగా విజయం సాధించాయి. తద్వారా యుక్రెయిన్‌ అజోవ్ సముద్రంలోకి వెళ్లేందుకు తాత్కాలికంగా ప్రవేశానికి కోల్పోయింది. అయితే, యుక్రెయిన్ బలగాలు సముద్రంలోకి తిరిగి ప్రవేశించాయా లేదా అనేది మంత్రిత్వ శాఖ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Russia Ukraine War Ukraine ‘temporarily’ Loses Access To Azov Sea

Russia-Ukraine War : 2003 నుంచే సీ ఆఫ్ అజోవ్‌పై రష్యాకు అధికారం :
2014లో యుక్రెయిన్ నుంచి మాస్కో స్వాధీనం చేసుకున్న క్రిమియాకు ల్యాండ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. అప్పుడే అజోవ్ సముద్రంలో ఉన్న మారియుపోల్‌ను రష్యా సైనికులు రోజుల తరబడి చుట్టుముట్టారు. యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా దాడులను ముమ్మరం చేసింది. సముద్ర తీరంలో వ్యూహాత్మక స్థానాన్ని మారియుపోల్ నగరం చుట్టూ రష్యా దళాలు చుట్టుముట్టాయి. యుక్రెయిన్ విడిపోయిన ప్రాంతాలలో ఒకటైన ఈ ప్రాంతంపైనే రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే పుతిన్ యుక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించింది. అప్పటినుంచి దీని లక్ష్యంగానే యుద్ధం కొనసాగుతోంది. క్రిమియా ప్రాంతాన్ని రష్యా 2014 మార్చిలో యుక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకుంది.

ఆ తర్వాత నుంచి ఈ ఉభయదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాయని ఆరోపిస్తూ రష్యా మూడు యుక్రెయిన్ బోట్లను అధీనంలోకి తీసుకోవడంతో ఆ రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రష్యా గత ఏడాది నుంచి కెర్చ్ జలసంధి గుండా యుక్రెయిన్ నౌకాశ్రయాల రాకపోకలను తనిఖీ చేస్తోంది. రష్యా 2003 నుంచి సీ ఆఫ్ అజోవ్‌ సముద్రంలోకి ప్రవేశించే నౌకలను తనిఖీలు చేసే అధికారాన్ని కలిగి ఉంది. అయితే ఈ అధికారాన్ని రష్యా దుర్వినియోగం చేస్తోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యా, క్రిమియాలను కలిపే కెర్చ్ జలసంధికి అడ్డంగా రష్యా ఒక బ్రిడ్జిని నిర్మించడాన్ని యుక్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Read Also : Russian Missiles : యుక్రెయిన్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్‌పై రష్యా క్షిపణుల దాడి..!

ట్రెండింగ్ వార్తలు