West Nile virus : ప్రపంచానికి మరో వైరస్ ముప్పు : రష్యా హెచ్చరిక

ఇప్పటికే కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు కకావికలం అయిపోయాయి. ఈక్రమంలో ‘వెస్ట్ నైల్ వైరస్’ ముప్పు పొంచి ఉందని రష్యా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

West Nile Virus

Russia Warns of West Nile Virus : ఇప్పటికే కరోనా వైరస్ తో చేస్తున్న పోరాటంతో ప్రపంచ దేశాలకు నవనాడులు కృంగిపోయాయి. ఆర్థికంగా ఎన్నో దేశాలు చితికిపోయాయి. పేద దేశాల పరిస్థితి చెప్పనే అక్కరలేదు. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాలో కూడా ఆర్థిక బాధలు తలెత్తాయి. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆర్థిక బాధలతో తల్లడిల్లుతున్నాయి. ఈ క్రమంలో పులిమీద పుట్రలాగా మరో ముప్పు వచ్చిపడుతోందని రష్యా హెచ్చరిస్తోంది. కొత్త వైరస్ ముప్పు ప్రపంచానికి పొంచి ఉందని హెచ్చరిస్తోంది రష్యా. ఈ వైరస్ సోకితే చికిత్సే లేదంటోంది. దీనికి ప్రస్తుతానికి చికిత్స గానీ టీకాలు గాని లేవంటోంది. దోమకాటు ద్వారా మానవుల్లోకి వైరస్ సంక్రమిస్తుందని..ఈ వైరస్ సోకితే తీవ్రమైన నరాల సంబంధ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు రష్యా సైంటిస్టులు. అదే ‘వెస్ట్ నైల్ వైరస్’ (‘West Nile Virus’). ఈ వెస్ట్ నైల్ వైరస్ ఇప్పటికే రష్యాలో శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రష్యా సైంటిస్టులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

రష్యాలో ఇప్పుడు టీకాలు గానీ..ఎటువంటి మందులు కానీ లేని ‘వెస్ట్ నైల్’ (డబ్ల్యూఎన్‌వీ) ఆందోళన కలిగిస్తోంది. ఇది ఈ వైరస్ ఉన్న దోమలు కుట్టడం ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. రష్యాలో వెలుగు చూస్తున్న వెస్ట్ నైల్ కేసుల్లో 80 శాతానికి పైగా నైరుతి ప్రాంతంలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చేది శీతాకాలం కావటంతో ఈ వ్యాధి మరింతగా పెరగవచ్చని రష్యా ఆరోగ్య శాఖ ఆందోళనవ్యక్తం చేస్తోంది.

కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను రష్యా హెచ్చరించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ వైరస్‌ పెరుగుతున్నా..రానున్న కాలంలో దోమలు పెరిగే అవకాశాలుండటంతో ఈ వైరస్ కలిగి ఉన్న దోమలు కుడితే మరింతగా ఈ వైరస్ కేసులు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దోమలుకుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..అసోసియేటెడ్ ప్రెస్ ఉత్తర డకోటాలో దోమల ద్వారా వ్యాపించే వెస్ట్ నైలు వైరస్ యొక్క మానవ కేసులు పెరుగుతున్నాయని నివేదించింది. ఇప్పటివరకు, ఐదుగురు వ్యక్తులు కేసులను నిర్ధారించారు, ఆసుపత్రిలో నలుగురు ఉన్నారు, అలాగే ఆరుగురు వ్యక్తులలో ఇద్దరు పెండింగ్‌లో ఉన్నారని నివేదిక తెలిపింది.

ఆఫ్రికాలో నిర్ధారణ అయిన ఈ వైరస్ తర్వాత యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా దేశాలకు వ్యాప్తిచెందింది. ఇది సోకిన వ్యక్తులు తీవ్రమైన నరాల సంబంధ వ్యాధుల బారినపడతారు. ఇది దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. వెస్ట్ నైల్ కేసులు దోమల సీజన్‌లోనే ఎక్కువగా సంభవిస్తాయని పేర్కొంది. ఇది వేసవిలో మొదలైనట్లుగా తెలుస్తోంది.

డబ్ల్యూఎన్‌వీ సోకిన వ్యక్తుల్లో ప్రతి 150 మందిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురవుతారని..తరచూ రోగాల బారినపడే అవకాశముందని తెలిపారు. కాబట్టి దోమలు దరిచేరకుండా కీటక నాశిని ఉపయోగించడం, పొడవు చేతులున్న చొక్కా, కాళ్ల కింది వరకు ఉన్న ప్యాంటును ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైరస్ సోకిన ప్రతి 10 మందిలో 8 మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అలాగే ప్రతి ఐదుగురిలో ఒకరిలో తీవ్రమైన జ్వరంతోపాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ బారినపడిన వారిలో చాలా వరకు కోరుకుంటారు. అయితే, ఆ తర్వాత కొన్ని నెలలపాటు నీరసంగా ఉంటుంది.

ఏ వయసు వారైనా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వారికి మరింత ముప్పు ఉంటుందని సీడీసీ తెలిపింది. మరీ ముఖ్యంగా కేన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, కిడ్నీ జబ్బులు, అవయమార్పిడి చేసుకున్న వారికి ముప్పు చాలా ఎక్కువని పేర్కొంది. ప్రస్తుతానికైతే ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి టీకాలు కానీ, చికిత్స కానీ అందుబాటులో లేదు. కాబట్టి నివారణే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏమిటి?
WNV అనేది ఈ వైరస్ సోకిన దోమల ద్వారా వ్యాపించే అంటువ్యాధి. ఇది సోకిన క్యూలెక్స్ దోమకాటుతో పక్షుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. ఇది మానవులలో ప్రాణాంతకమైన న్యూరోలాజికల్ వ్యాధికి దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ఈ వైరస్ దాదాపు 20 శాతం కేసులలో వెస్ట్ నైల్ జ్వరానికి కారణమవుతుంది. ఇది జికా, డెంగ్యూ మరియు ఎల్లో ఫీవర్ వైరస్‌లకు సంబంధించినదని నిపుణులు వెల్లడించారు.

ఉగండా నుంచి WNV
WHO ప్రకారం.. WNV మొదటిసారిగా 1937 లో ఉగాండాలోని వెస్ట్ నైలు జిల్లాలో ఒక మహిళలో గుర్తించబడింది. 1953 లో నైల్ డెల్టా ప్రాంతంలో పక్షులలో (కాకులు మరియు కొలంబిఫార్మ్స్) గుర్తించబడింది.

1997 కి ముందు..WNV పక్షులకు వ్యాధికారకంగా పరిగణించబడలేదు. కానీ ఆ సమయంలో ఇజ్రాయెల్‌లో మరింత తీవ్రమైన మెదడువాపు, పక్షవాతంవంటి లక్షణాలతో వివిధ పక్షుల జాతుల మరణానికి కారణమైంది. WNV కి కారణమైన మానవ అంటువ్యాధులు 50 సంవత్సరాలుగా అనేక దేశాలలో గుర్తించబడ్డాయని WHO వెల్లడించింది.

వెస్ట్ నైల్ వైరస్ మెదడులోకి ప్రవేశిస్తే..ప్రాణాంతకంగా మారుతుంది. ఇది మెదడు వాపు, లేదా వెన్నుపాము చుట్టూ ఉండే కణజాలం వాపుకు కారణమవుతుంది. దీంతో ప్రాణాలకే ప్రమాదంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ వెస్ట్ నైల్ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.