Ukraine attacks : యుక్రెయిన్‌ దాడుల్లో రష్యా మిలటరీ జనరల్ మృతి

రెండో చెచెన్‌ యుద్ధంలో జనరల్ విటాలీ రష్యా తరపున పోరాడారు. ఇది కాకుండా రష్యన్ జనరల్ సిరియన్ యుద్ధంలో పాల్గొన్నారు. యుక్రెయిన్ నుంచి క్రిమియాను విముక్తి చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు.

Russian Army General

Russian military general killed : రష్యా-యుక్రెయిన్‌ మధ్య 13వ రోజూ భీకర యుద్ధం కొనసాగుతోంది. పుతిన్‌ దళాలకు షాక్‌లు షాక్‌లు ఇస్తోన్న యుక్రెయిన్‌ ఏకంగా రష్యా మిలటరీ జనరల్‌ను చంపేసింది. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో, రష్యా జనరల్ విటాలీ గెరాసిమోవ్ ప్రాణాలు కోల్పోయారు. రెండవ చెచెన్‌ యుద్ధంలో జనరల్ విటాలీ రష్యా తరపున పోరాడారు. ఇది కాకుండా, రష్యన్ జనరల్ సిరియన్ యుద్ధంలో పాల్గొన్నారు. యుక్రెయిన్ నుంచి క్రిమియాను విముక్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు జనరల్ విటాలీ గెరాసిమోవ్. అటు బెలారస్‌లో జరిగిన రష్యా-యుక్రెయిన్ మధ్య మూడో రౌండ్ శాంతి చర్చలు విఫలమయ్యాయి.

ఇక ఇవాళ కూడా రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. ఐదు ప్రధాన నగరాల్లో రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్‌, చెర్నిహివ్‌, ఖార్కివ్‌, సుమి, మరియుపోల్ నగరాల్లో కాల్పుల విరమిస్తున్నట్లు తెలిపింది. అటు పౌరుల తరలింపు కోసం కారిడార్లు తెరిచిన యుక్రెయిన్‌. అయితే కాల్పుల విరమణ ప్రకటించినా రష్యా దాడులు చేస్తోందంటు యుక్రెయన్ ఆరోపిస్తోంది. ఇక సుమిలో పౌరుల తరలింపు వేగవంతం చేసే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. ఇప్పటికే 20వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించింది కాల్పుల విరమణ ప్రకటించినా రష్యా దాడులు చేస్తోందంటున్న యుక్రెయన్.

Russia Suspend Ceasefire : ఉక్రెయిన్​లో తాత్కాలికంగా కాల్పులు విరమించిన రష్యా

అటు రష్యా తన దురాక్రమణలో భాగంగా యుక్రెయిన్‌లోని చాలా నగరాల్లో మారణకాండ సృష్టించింది. కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడిచింది. యుద్ధ నియమాలను తుంగలో తొక్కి.. జనావాసాలపై విరుచుకుపడింది. ఖార్కివ్‌ నగరంపై దాడులు చేసినట్లుగా యుక్రెయిన్‌ చెబుతోంది. భూతల, గగనతలాల నుంచి దాడులు కొనసాగుతుండడంతో.. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు తెలిపింది. ఇక రష్యాకు పెద్దఎత్తునే ఎదురు దెబ్బలు తగిలినట్లు యుక్రెయిన్‌ సైనిక దళాలు చెబుతున్నాయి.

ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న 30 రష్యన్‌ హెలికాప్టర్లను ధ్వంసం చేశామని మరైన్‌ కంట్రోల్‌ అధికారులు వెల్లడించారు. అటు ఖెర్సోన్‌, కీవ్‌, చెర్నిహివ్‌, మైకొలైవ్‌ నగరాలపై పట్టుకోసం రష్యన్‌ సేనలు భీకర పోరు సాగిస్తున్నాయి. రష్యా కాల్పుల్లో హోస్టొమెల్‌ మేయర్‌ యూరి చనిపోయారు. ఇక ఖార్కివ్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో మోహరించిన 30 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్‌ మరైన్‌ విభాగం ప్రకటించింది.

Ukraine-Russia : రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడో విడత చర్చల్లో పురోగతి

మైకొలైవ్‌ నగరంపైనా రష్యా దాడులు చెసిందని.. అయితే రష్యాకు చెందిన ఒక సుఖోయ్‌ విమానాన్ని నేలకూల్చామని వెల్లడించంది. ఇక కీవ్‌ సమీపంలోని విషోరొడ్‌ ప్రాంతంలో ఒక రష్యా హెలికాప్టర్‌ను గాల్లోనే పేల్చేసినట్లు యుక్రెయిన్‌ తెలిపింది. జప్రోజియాలో ఆరు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా.. హులియపోల్‌, ఒరిఖివ్‌, చాలాచినో నగరాల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాలను యుక్రెయిన్‌ సేనలు ప్రతిఘటిస్తున్నాయి.