Pak girl thanks Modi : ‘మా ప్రాణాలు కాపాడారు’…ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన పాకిస్థాన్ బాలిక..

యుక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో కీవ్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పింది.

Russian ukraine war..Pakistani girl thanks PM Modi Indian Embassy  : రష్యా యుద్ధంతో యుక్రెయిన్ చిరుగుటాకులా అల్లాడిపోతోంది. ఎంతోమంది ఇతర దేశాలకు వలసలు పోతున్నారు. ప్రాణాలు దక్కించుకోటానికి వేరే దేశాలకు తరలిపోతున్నారు. కానీ యుద్ధ వాతావరణంలో దేశం నుంచి బయటపడాలంటే చాలా చాలా కష్టంగా మారింది. ఈక్రమంలో యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించటానికి భారత్ ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ను చేపట్టిన విషయం తెలిసిందే. అలా ఇప్పటికే వేలాదిమంది విద్యార్దులతో సహా భారతీయుల్ని తరలించింది భారత ప్రభుత్వం. ఈక్రమంలో భారత్ కు సరిహద్దు దేవం..శతృదేశం..అయినా పాకిస్థాన్ కు చెందిన బాలికను కూడా భారత్ ఎంబసీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. దీంతో సరు పాకిస్థాన్ బాలిక ప్రధాని మోడీకి, భారత రాయబారకార్యాలయానికి ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించినవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read : CM KCR : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. 91,142 ఉద్యోగ పోస్టుల భర్తీ, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్
యుక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో యుక్రెయిన్ లోని కీవ్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ కు చెందిన ఆ బాలిక పేరు ఆస్మా షఫీక్. ఆ వీడియోలో బాలిక మాట్లాడుతూ.. కీవ్ లో తాను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపింది.

Also read : Zelensky Compromise : రష్యాతో యుద్ధంపై యుక్రెయిన్ అధ్యక్షుడు రాజీబాట.. నాటోలో చేరేదే లేదన్న జెలెన్‌స్కీ

‘‘ ఈ వీడియోలో ఆస్మా మాట్లాడుతూ..చాలా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మాకు అన్ని విధాలుగా సాయం చేసిన కీవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భారత ప్రధాని మోడీకి కూడా ధన్యవాదాలు అని తెలిపింది. మేం మాదేశానికి సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం. భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు’’ అని ఆస్మా తెలిపింది. ఆస్మా ఇప్పుడు పశ్చిమ యుక్రెయిన్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి ఆమె బయటపడి స్వదేశానికి చేరుకుంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు