Zelensky Compromise : రష్యాతో యుద్ధంపై యుక్రెయిన్ అధ్యక్షుడు రాజీబాట.. నాటోలో చేరేదే లేదన్న జెలెన్‌స్కీ

రష్యా చేసిన మరో కీలక డిమాండ్‌పైనా రాజీకి జెలెన్‌స్కీ సిద్ధమన్నారు. ఓ న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Zelensky Compromise : రష్యాతో యుద్ధంపై యుక్రెయిన్ అధ్యక్షుడు రాజీబాట.. నాటోలో చేరేదే లేదన్న జెలెన్‌స్కీ

Zelensky

Ukrainian president Zelensky compromise : రష్యాతో రాజీకి సిద్ధమైనట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంకేతాలు ఇస్తున్నారు. తమ దేశంపై రష్యా దురాక్రమణను ఆపేలా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి కారణమైన నాటోలో తమ దేశం చేరే ఆలోచనను విరమించుకుంటున్నట్టు వెల్లడించారు. రష్యా చేసిన మరో కీలక డిమాండ్‌పైనా రాజీకి జెలెన్‌స్కీ సిద్ధమన్నారు. ఓ న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను పంచుకున్నారు. తమకు నాటో సహకారం లేదని, అంతర్జాతీయ సమాజం కూడా రష్యా దాడులను ఆపలేక పోయిందన్నారు.

రోజురోజుకు తమ పౌరులు చనిపోతున్నారని.. పరిస్థితులు మరింతలా దిగజారి పోతున్నాయని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో నాటోలో చేరే ఆలోచనను విరమించుకుంటున్నట్టు జెలెన్‌స్కీ తెలిపారు. నాటోపై జెలెన్‌స్కీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోవియట్‌ నుంచి విడిపోయిన దేశాల మధ్య నాటో చిచ్చు పెట్టిందని విమర్శించారు. ఉత్తర అట్లాంటిక్‌ సమాఖ్య పేరుతో ఏర్పడ్డ నాటో తూర్పునకూ చొచ్చుకుపోయిందని.. ఐరోపాకు, రష్యాకు మధ్య కోల్డ్‌వార్‌కి దారి తీసిందని దుయ్యబట్టారు.

Tamil Nadu Student : యుక్రెయిన్ సైన్యంలో చేరిన తమిళనాడు విద్యార్థి

నాటోలో చేరతామని ఎన్నో ఏళ్లుగా ప్రాధేయపడ్డామన్నారు. కానీ ఇప్పటి పరిస్థితులు బట్టి చూస్తే…. ఇక తాము అసలు నాటోలో చేరేదే లేదని స్పష్టం చేశారు. నిజానికి రష్యా దురాక్రమణకు ప్రధాన కారణం ఉక్రెయిన్‌ నాటోలో చేరే ప్రయత్నాలే. ఇప్పుడు నాటోలో చేరేదే లేదని జెలెన్‌స్కీ ప్రకటించడంతో… రష్యా తన బలగాలను ఉపసంహరించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుక్రెయిన్‌పై యుద్ధానికి రెండు రోజుల ముందు డోనెట్స్క్‌, లుగాన్స్క్‌ రాష్ట్రాలను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆ మేరకు సంతకం కూడా చేశారు. దీంతో రష్యా అధ్యక్షుడి తీరుపై యుక్రెయిన్‌ తీవ్రంగా స్పందించింది. యుద్ధం ఏక్షణంలోనైనా మొదలవుతుందని భావించి.. రష్యా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది. ఈ పరిణామాలు కూడా పుతిన్‌ను ఆక్రమణకు ఉసిగొల్పాయి. అయితే.. జెలెన్‌స్కీ తన ఇంటర్వ్యూలో ఈ రెండు రాష్ట్రాలపైనా కీలక ప్రకటన చేశారు. డెనెట్స్క్‌, లుగాన్స్క్‌ రాష్ట్రాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించేందుకు సిద్ధమని తెలిపారు. అయితే దీనిపై చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Ukrainians Emigrated : యుక్రెయిన్-రష్యా యుద్ధం.. 11 రోజుల్లో 17 లక్షల మంది యుక్రేనియన్లు పొరుగు దేశాలకు వలస

ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న యుక్రెయిన్‌ మద్దతుదారుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు పరిష్కారం కావాలని జెలెన్‌స్కీ కోరారు. ఉక్రెయిన్‌తో చర్చలు మొదలవ్వడానికి ముందే రష్యా అధ్యక్షుడు ఓ మాట అన్నారు. ఎన్ని సార్లు చర్చలకైనా సిద్ధమే. కానీ, చర్చల సంఖ్య పెరిగే కొద్దీ..మా షరతులు, డిమాండ్లు పెరుగుతాయి అని స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్లే చర్చలు జరిగిన ప్రతిసారి డిమాండ్లు పెరిగాయి. నాటోకు దూరంగా ఉండడం, రెండు రాష్ట్రాలను స్వతంత్రంగా గుర్తించడం వరకే జెలెన్‌స్కీ తాజాగా హామీ ఇచ్చారు.

అయితే.. పూర్తిస్థాయిలో యుక్రెయిన్‌ను మిలటరీ రహిత దేశంగా ప్రకటించాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది. దానికి తోడు క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా గుర్తించాలని చెబుతోంది. ఈ రెండు డిమాండ్లకూ జెలెన్‌స్కీ అంగీకరిస్తాడా? క్రిమియాను వదులుకోవడమంటే అపారమైన సహజ వాయువులు, చమురు సంపదను రష్యా చేతుల్లో పెట్టడమే. ఈ నేపథ్యంలో రష్యా ఎలా స్పందిస్తుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.