Ukrainians Emigrated : యుక్రెయిన్-రష్యా యుద్ధం.. 11 రోజుల్లో 17 లక్షల మంది యుక్రేనియన్లు పొరుగు దేశాలకు వలస

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ టార్గెట్‌గా రష్యా సైన్యం కదులుతోంది. ఆ నగరం చుట్టూ భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది.

Ukrainians Emigrated : యుక్రెయిన్-రష్యా యుద్ధం.. 11 రోజుల్లో 17 లక్షల మంది యుక్రేనియన్లు పొరుగు దేశాలకు వలస

Emigrate

Ukrainians emigrated : రష్యా సైనిక చర్య నేపథ్యంలో లక్షలాది మంది యుక్రేనియన్లు పొరుగు దేశాలకు తరలివెళ్తున్నారు. 11 రోజుల వ్యవధిలో 17 లక్షలకుపైగా పౌరులు యుక్రెయిన్‌ను వీడారని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ UNHCR వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతోన్న శరణార్థుల సంక్షోభం ఇదేనని పేర్కొంది. ఈ అర్థం లేని సంఘర్షణకు తక్షణమే ముగింపు పలకకపోతే.. రాబోయే రోజుల్లో లక్షలాది ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

మరోవైపు యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ టార్గెట్‌గా రష్యా సైన్యం కదులుతోంది. ఆ నగరం చుట్టూ భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. వందల సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లను ఇప్పటికే కీవ్ సరిహద్దులకు తరలించింది. త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తున్న రష్యా సైనికులు.. కీవ్‌పై పట్టు చిక్కించుకునేందుకు దూసుకుపోతున్నారు. మరోవైపు… రష్యా సైన్యం కీవ్‌లోకి అడుగుపెట్టకుండా యుక్రెయిన్‌ పటిష్ట వ్యూహం అమలు చేస్తోంది. సిటీలోని ప్రధాన వీధుల్లో నిఘా పెంచింది. ప్రతి సెంటర్‌లో పెద్ద ఎత్తున్న సైన్యాన్ని మోహరించింది. రహదారులపై ఇసుక బస్తాలు, బారికేడ్లు, ముళ్ల కంచెలను అడ్డుగా పెట్టింది.

Dmitry Peskov : ఆ షరతులకు యుక్రెయిన్ అంగీకరిస్తే.. ఈ క్షణమే దాడులు ఆపేస్తాం-రష్యా

రష్యాతో పోరులో యుక్రెయిన్‌ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి దాడి చేస్తూనే ఉంది. మా దేశాన్ని కాపాడుకుంటాం, దురాక్రమణకు గురికానివ్వమంటూ యుక్రెయిన్‌ వాసులు ప్రతి దాడులు చేస్తున్నారు. ఆఖరికి మహిళలు, చిన్నపిల్లలతో సహా.. సమరానికి సై అంటూ కదనరంగంలోకి దిగుతున్నారు. రష్యా దళాలకు ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. రష్యన్‌ యుద్ధ ట్యాంకులను అడ్డుకుంటున్నారు. వాటిని కాల్చివేస్తున్నారు. ఇరుదేశాల దాడుల్లో ఇప్పటికే వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

రష్యా బలగాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న యుక్రెయిన్‌.. ఆ దేశ సైన్యాన్ని చావుదెబ్బ కొడుతోంది. యుద్ధం మొదలై ఇప్పటికే 12 రోజులు గడిచిపోవడంతో.. రష్యన్‌ సేనలకు ఆహారం, యుద్ధ వాహనాలకు ఇంధనం కొరత ఏర్పడుతోంది. యుక్రెయిన్ వాసులు కూడా సరిగ్గా దానిపైనే టార్గెట్ చేస్తున్నారు. రష్యా నుంచి యుక్రెయిన్‌లోకి వచ్చే ఆయిల్ ట్యాంకర్లను, ఆహార సరఫరా చేస్తున్న వాహనాలను అడ్డుకుంటున్నారు.