Eiffel Tower: ఈఫిల్ టవర్‌కు తుప్పు.. రిపైర్ చేయకుంటే తప్పదు ముప్పు

ఈఫిల్ టవర్ కు పెద్ద తంటా వచ్చిందట. అసలే 2024 ఒలింపిక్ గేమ్స్ పారిస్ లో జరగనున్న దృష్ట్యా ముందుగానే రిపేరింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాంటిది 60 మిలియన్ యూరోలతో పెయింటింగ్ ఖర్చులు తగదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

Eiffel Tower: ఈఫిల్ టవర్ కు పెద్ద తంటా వచ్చిందట. అసలే 2024 ఒలింపిక్ గేమ్స్ పారిస్ లో జరగనున్న దృష్ట్యా ముందుగానే రిపేరింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాంటిది 60 మిలియన్ యూరోలతో పెయింటింగ్ ఖర్చులు తగదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

19వ శతాబ్దంలో గుస్తవె ఈఫిల్ నిర్మించిన 324 మీటర్ల టవర్ చూసేందుకు ప్రపంచంలోనే అత్యధిక మంది విజిటర్లు.. దాదాపు ఏడాదికి ఆరు మిలియన్ల మంది టూరిస్టులు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

టవర్ నిర్మించిన గుస్తవె ఒకసారి చూస్తే ఆయనకు హార్ట్ అటాక్ రావడం ఖాయమని మేనేజర్లలో ఒకరు అంటున్నారు. ఈఫిల్ టవర్ పనులు చూసుకుంటున్న మేనేజ్మెంట్ దీనిపై ఎటువంటి కామెంట్ చేయలేదు. 2024 ఒలింపిక్స్ కంటే ముందే 60మిలియన్ యూరోలు ఖర్చు పెట్టి పెయింటింగ్ పనులు చేపట్టనున్నారు. ఇలా టవర్ కు పెయింటింగ్ వేయడం 20వ సారి.

Read Also: 19 అడుగుల ఎత్తు పెరిగిన ఈఫిల్ టవర్

30శాతం పెయింటింగ్ వేసిన తర్వాత కొవిడ్ మహమ్మారి కారణంగా పెయింటింగ్ ప్రక్రియ నిలిపేశారు. ఇప్పుడు మరోసారి పెయింటింగ్ వేయించాలని మేనేజర్ వివరించారు. మహమ్మారి కారణంగా టూరిస్టులు రాక తగ్గేసరికి పెయింటింగ్ కు నిధులు సరిపోవడం లేదని మేనేజ్మెంట్ చెప్తుంది.

ట్రెండింగ్ వార్తలు