World Safest City: ప్ర‌పంచంలో సుర‌క్షిత‌మైన న‌గ‌రం కోపెన్ హాగెన్..ఎందుకంటే..

ప్ర‌పంచంలో అత్యంత సుర‌క్షితమైన నగరంగా డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్ నిలిచింది. 2021కిగాను ప్ర‌పంచంలో అత్యంత సుర‌క్షితమైన న‌గరాల లిస్టులో కోపెన్ హాగ్ కు దక్కించుకుంది.

Safe Cities Index 2021 Copenhagen: ప్ర‌పంచంలో అత్యంత సుర‌క్షితమైన నగరంగా డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్ నిలిచింది. 2021కి గాను ప్ర‌పంచంలో అత్యంత సుర‌క్షితమైన న‌గరాల జాబితాను రిలీజ్ చేసింది ఎక‌న‌మిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) స‌ర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ క‌రోనాకాలం వచ్చాక సుర‌క్షిత న‌గ‌రాల లిస్టులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్ర‌తి ఏటా జ‌పాన్ రాజ‌ధాని టోక్యో, సింగ‌పూర్ టాప్ 2లో ఉండేవి. కానీ ఇప్పుడు ఆ జాబితాలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ 2021లో చేసిన సర్వేలో ఆ స్థానాన్ని డెన్మార్క్ రాజ‌ధాని కోపెన్‌హాగ‌న్ ఎగ‌రేసుకుపోయింది. డెన్మార్క్ స్థానంలో కెన‌డా న‌గ‌రం టొరంటో నిలవగా సింగ‌పూర్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ కరోనా కాలంలో జరిగిన మార్పుల్లో ఇది చాలా గమనించాల్సిన విషయం.డెన్మార్క్ మొదటిస్థానంలో ఉండగా కెనడా, సింగపూర్ లో టాప్ మూడులో నిలవగా..ఆస్ట్రేలియాలోని సిడ్నీ నాలుగస్థానంలో నిలిచింది. మరి మన భారత్ ఏస్థానంలో ఉంది అంటే..మన దేశ రాజధాని ఢిల్లీ నగరం..అలాగే దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరాలు టాప్ 50లో నిలిచాయి.

సురక్షితమైన నగరాల్లో టాప్ 50లో..ఢిల్లీ, ముంబైలు
ఈఐయూ 2015 నుంచి ప్ర‌తి రెండేళ్ల‌కోసారి ఈ స‌ర్వే నిర్వ‌హిస్తోంది.ఈ స‌ర్వేలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 60 న‌గ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోగా..డిజిట‌ల్‌, ఆరోగ్యం, వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణం, మౌలిక స‌దుపాయాలు వంటి 76 అంశాల్లో 100కుగాను స్కోర్లు కేటాయించారు. ఈ సంవత్సరం సురక్షిత నగరాల లిస్టులో మ‌న ఢిల్లీ, ముంబైల‌కు కూడా టాప్ 50లో చోటు ద‌క్కించుకోవటం విశేషం. ఈ నగరాలకు వచ్చిన పాయింట్లు చూస్తే..ఢిల్లీ 56.1 పాయింట్లు, ముంబై 54.4 పాయింట్లు స్కోరు దక్కించుకున్నాయి.

కరోనా వల్ల అర్బ‌న్ సేఫ్టీ విష‌యంలో పలు మార్పులు స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారాలు ఆన్‌లైన్‌కు మార‌డంతో డిజిట‌ల్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యంగా మారింది.ఈ విషయాన్ని ఈఐయూ వెల్లడించింది. ఇక అస‌లు సుర‌క్షితం కాని న‌గ‌రాల లిస్టులో యాంగోన్, లాగోస్‌, కార‌క‌స్‌,ఈజిప్టు రాజధాని కైరో, పాకిస్తాన్ లోని క‌రాచీ నగరాలు ఉన్నాయి.

కోపెన్ హాగన్ ఎందుకు సురక్షితమైన నగరం?
ఈ కరోనాల కాలంలో నేరాలు కూడా చాలా ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయనే విషయం తెలిసిందే. దీనికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా. మానసికంగా వచ్చిన మార్పులు పలు నేరాలకు కారణంగా కనిపిస్తున్నాయి.గృహహింస పెరిగింది.లైంగిక వేధింపులు పెరిగాయి. కానీఈ కరోనా కాలంలో కూడా డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్ సురక్షిత నగరంగా ఎందుకు నిలిచింది అంటే..

కరోనా వల్ల ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈక్రమంలో నేరాల సంఖ్యకూడా పెరిగింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా కోపెన్ హాగెన్ నగర ప్రజలు సురక్షితంగా ఎందుకు ఉండగలుగుతున్నారంటే..ఆ నగరంలో డిజిటల్ భద్రత,మౌలిక సందుపాయాలు, ఆరోగ్య భద్రత, వ్యక్తిగత భద్రత వంటి పలు సౌకర్యాలు ఉన్నాయి. కోవిడ్ -19 ప్రపంచ భద్రతను దెబ్బతీస్తున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా డెన్మార్క్ రాజధాని పాలకులు ప్రజలు ఇన్ని భద్రతలను కల్పిస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత భద్రతా నగరంగో కోపెన్ హాగెన్ నిలిచింది. 2019లో సురక్షిత నగరాల జాబితాలు కోపెన్ హాగెన్ టాప్ 8లో ఉంటే ఈ కరోనా సమయంలో కూడా తన భద్రతను మరింతగా మెరుగుపరుచుకుని పైకి ఎగబాకి టాప్ 1లో 82.4పాయింట్లతో నిలిచింది.

టాప్ 15 సురక్షితమైన నగరాల పేర్లు,స్కోర్లు
కోపెన్‌హాగన్ – 82.4

టొరంటో – 82.2

సింగపూర్ – 80.7

సిడ్నీ – 80.1

టోక్యో – 80.0

ఆమ్స్టర్డామ్ – 79.3

వెల్లింగ్టన్ – 79.0

హాంకాంగ్ – 78.6

మెల్బోర్న్ – 78.6

స్టాక్‌హోమ్ – 78.0

బార్సిలోనా – 77.8

న్యూయార్క్ – 77.8

ఫ్రాంక్‌ఫర్ట్ – 77.7

వాషింగ్టన్ DC – 77.4

లండన్ – 77.2

ట్రెండింగ్ వార్తలు