Camels Beauty Contest
Camels Beauty Contest : సౌదీ అరేబియా అంటే ఎడారి ఓడలే గుర్తుకొస్తాయి. అదేనండీ ఒంటెలు. సౌదీ వాసులు ఒంటెలకు అందాల పోటీలు నిర్వహించారు. సౌదీ రాజధాని రియాద్‌కు ఈశాన్యంలో ప్రసిద్ధ కింగ్ అబ్దుల్ అజీజ్ ఒంటెల పండుగ ప్రతీ సంవత్సరం నెల రోజులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో అందాల ఒంటెల పోటీలు నిర్వహించి అందమైన ఒంటెల పెంపకం దారులకు కోట్లల్లో భారీ ప్రైజ్ మనీ ఇస్తారు. అంత ఇంతా కాదు ఏకంగా రూ. 500 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తారు. వారిని ఘనంగా సత్కరిస్తారు. ఒంటెల తలలు, మెడలు, మూపురం, దుస్తులు, వాటి భంగిమల ఆకారాన్ని బట్టి నిర్వహకులు విజేతను నిర్ణయిస్తారు. కానీ ఒంటెల అందాల పోటీ పేరుతో వాటి యజమానులు వాటిని అత్యంత దారుణంగా హింసలకు గురించేయటం చాలా దారుణమైన విషయం.
Read more : Beauty Pageant for Sheep: అందాల పోటీల్లో గొర్రెల క్యాట్ వాక్.. మీరెప్పుడైనా చూశారా?
కానీ ఒంటెలు అందంగా ఆకర్షణీయంగా కనిపించటానికి వాటిని యజమానులు హింసలకు గురి చేయటం చాలా బాధాకరమైన విషయం. ప్రైజ్ మనీ కోసం పేరు కోసం ఆ మూగ జీవాలను హింసలకు గురిచేస్తారు వాటి యజమానులు. ఒంటెల యజమానులు వారి ఒంటెలను ఆకర్షణీయంగా మార్చడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు చేస్తారు. ఫేస్ లిఫ్ట్‌లు వంటి సౌందర్య సాధనాలను వాడతారు. ఇటువంటివి వాడకూడదనే నియమం ఉంది. కానీ ఇవి మాత్రం జరుగుతునే ఉంటాయి. ప్రైజ్ మనీ కోసం వాటికి ఇంజెక్షన్లు ఇస్తుంటారు యజమానులు.
ఈ అందాల పోటీలు నిర్వహించే వారు ఒంటెల్ని పరీక్షిస్తారు. వాటికి ఇంజెక్షన్లు చేశారా?అని. అలా ఈ సంవత్సరం కూడా ఒంటెల అందాల పోటీల్లో తనిఖీలు చేపట్టారు. అత్యధునిక టెక్నాలజీని వినియోగించి ఒంటెలను తనఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 40కి పైగా ఒంటెలు ఈ అందాల పోటీకి అనర్హులు అని నిర్వాహకులు ప్రకటించారు.చాలామంది ఒంటెల పెంపకందారులు బొటాక్స్‌తో ఇంజెక్షన్‌లు ఇచ్చి, వాటి అవయవాలకు రబ్బరు బ్యాండ్లు వేసి శరీర భాగాలను పెంచే ప్రయత్నంలో వాటిని బాగా హింసించినట్లుగా ఈ తనిఖీల్లో తేలింది. దీంతో సదరు ఒంటెల యజమానులపై అనర్హత వేటు విధించారు.అంతేకాదు…ఆ ఒంటెల పెంపకందారులకు కఠిన జరిమాన కూడా విధించారు.
Read more : పందులతో జల్లికట్టు పోటీ..గెలవటం అంత ఈజీ కాదు..
దీనిపై ఒంటెల అందాల పోటీ కమిటీ ప్రతినిధి మర్జౌక్ అల్-నాట్టో మాట్లాడుతూ..పెంపకందారులు ట్యాంపరింగ్ చేసినట్లు గుర్తించి..నేరాన్ని బట్టి జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫిల్లర్లు, బొటాక్స్ లేదా హార్మోన్లను ఇంజెక్ట్ చేసినందుకు ఒంటెకు 100,000 రియాల్స్ వరకు జరిమానా ఉంటుందని..అలాగే తోకను కత్తిరించినా..ఆ క్రమంలో ఆ ఒంటె చనిపోయినందుకు కారణమైన యజమానులకు 30,000 రియాల్స్ జరిమానా విధించబడుతుందని తెలిపారు.