Beauty Pageant for Sheep: అందాల పోటీల్లో గొర్రెల క్యాట్ వాక్.. మీరెప్పుడైనా చూశారా?

మనం ఇప్పటి వరకు మనుషుల అందాల పోటీలు చూశాం. బ్యూటీ కాంపిటీషన్ అంటే ఆ తళుకులు బెళుకులు వేరు. అందునా ఉమెన్స్ కాంపిటీషన్ అంటే ఆ కలరింగే వేరుగా ఉంటుంది. మనుషులలోనే కాదు పెంపుడు జంతువులకు ఈ అందాల పోటీలు అప్పుడప్పుడు నిర్వహిస్తుంటారు. అలానే ఇప్పటి వరకు మన దేశంలో పెంపుడు కుక్కల అందాల పోటీలు చూశాం. కానీ టర్కీలో గొర్రె పిల్లలకు కూడా అందాల పోటీలు నిర్వహించారు.

Beauty Pageant for Sheep: అందాల పోటీల్లో గొర్రెల క్యాట్ వాక్.. మీరెప్పుడైనా చూశారా?

Turky1

Beauty Pageant for Sheep: ఇది చదివితే ఒడెమ్మ బడవా ఇది నేను చూడలే అని అనుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఇప్పటి వరకు మనుషుల అందాల పోటీలు చూశాం. బ్యూటీ కాంపిటీషన్ అంటే ఆ తళుకులు బెళుకులు వేరు. అందునా ఉమెన్స్ కాంపిటీషన్ అంటే ఆ కలరింగే వేరుగా ఉంటుంది. మనుషులలోనే కాదు పెంపుడు జంతువులకు ఈ అందాల పోటీలు అప్పుడప్పుడు నిర్వహిస్తుంటారు. అలానే ఇప్పటి వరకు మన దేశంలో పెంపుడు కుక్కల అందాల పోటీలు చూశాం. కానీ టర్కీలో గొర్రె పిల్లలకు కూడా అందాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు అంతర్జాతీయ మీడియాను ఆకర్షించగా వీడియోలు ఇంటర్నెట్ లో తెగ హల్చల్ చేస్తున్నాయి.

ఆగ్నేయ ట‌ర్కీ ప్రావిన్స్‌లోని దియార్‌బ‌కీర్ అనే చోట జ‌రిగిన ఈ అందాల పోటీల్లో దాదాపుగా రెండు డ‌జ‌న్ల గొర్రెలు పాల్గొనగా.. సాధారణంగా మనుషుల అందాల పోటీలను తలదన్నేలా ఈ గొర్రెల అందాల పోటీలు నిర్వహించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో జంతువుల మధ్య నిర్వహించిన అందాల పోటీల కంటే ఈ గొర్రెపిల్ల‌ల అందాల పోటీ కాస్త ప్ర‌త్య‌కంగానే ఉంది. అందుకే నెటిజ‌న్లు, సామాజిక మాధ్య‌మాల్లో అంత‌‌గా ఆద‌రిస్తున్నారు. ఈ పోటీల్లో గొర్రె పిల్లల యజమానులే దగ్గర ఉండి తమ పెంపుడు గొర్రె పిల్లలను ర్యాంప్ మీద నడిపిస్తారు.

రకరకాల డిజైన్లతో కూడిన దుస్తులు.. కళ్ళకు అద్దాలు ధరించి ర్యాంప్ మీద నడిచే గొర్రె పిల్లలు కాస్త బెరుకు.. మరికాస్త సిగ్గుతో వాక్ చేస్తుంటే అక్కడి షో నిర్వాహకులతో పాటు అక్కడి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా కొందరిని తెగ మురిపిస్తుంటే.. మరికొందరు అంతగా ఈ వీడియోలో స్పెషల్ ఏముందా అని వీడియోలు వీక్షిస్తున్నారు. కాగా టర్కీలో గొర్రెల పెంపకం తీవ్రంగా వెనకబడింది. దీంతో ప‌శువుల పెంప‌కాన్ని ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వ‌హించగా మంచి స్పంద‌నే వ‌చ్చింది. బుజ్జి బుజ్జి గొర్రె పిల్లలతో అక్కడి ప్రజలు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించడం మరికాస్త విశేషంగా కనిపించింది.