Saudi Prince Abdullah Death : సౌదీ యువరాజు మృతి కేసు.. ఏడాది తర్వాత బయటపడిన అసలు నిజం.. మరణానికి ఇదే కారణం

Saudi Prince Abdullah Death : టాక్సికాలజీ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. మృతిచెందే సమయంలో అతని రక్తంలో 100 మిల్లీలీటర్లకు 222 మిల్లీగ్రాముల ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది.

Saudi Prince Abdullah Death

  • గతేడాది లండన్ హోటల్‌లో సౌదీ యువరాజు మృతి
  • ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు
  • టాక్సికాలజీ రిపోర్ట్‌లో కీలక విషయాలు

Saudi Prince Abdullah Death : గత ఏడాది లండన్‌లోని ప్రముఖ మారియట్ హోటల్‌లో మృతి చెందిన సౌదీ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దులఅజీజ్ బిన్ జలావీ అల్ సౌద్ మరణానికి సంబంధించిన సంచలన విషయాలు ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చాయి. యూకే కోర్టులో సమర్పించిన టాక్సికాలజీ నివేదిక ప్రకారం, అధిక మోతాదులో ఆల్కహాల్‌తో పాటు మత్తు పదార్థాలు, ఆందోళన నివారణ మందుల ప్రభావం వల్ల ఆయన మృతి చెందినట్లు వెల్లడైంది.

Also Read : PM Modi Video : సోషల్ మీడియాలో ప్రధాని మోదీ పవర్.. ఒక్క వీడియోతో వరల్డ్ రికార్డు..

టాక్సికాలజీ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. మృతిచెందే సమయంలో అతని రక్తంలో 100 మిల్లీలీటర్లకు 222 మిల్లీగ్రాముల ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. యూకేలో అమల్లో ఉన్న చట్టబద్ధ డ్రింక్-డ్రైవింగ్ పరిమితి కంటే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. అంతేగాక గామా-హైడ్రాక్సీబ్యూటిరేట్ (GHB) అనే మత్తు పదార్థం, క్యానబిస్ (గంజాయి) ఆనవాళ్లు, అలాగే ఆందోళన చికిత్సలో ఉపయోగించే జానాక్స్ (Xanax) ఔషధం కూడా ఆయన శరీరంలో ఉన్నట్లు నిర్ధారణ అయింది.

2025 నవంబర్‌లో లండన్‌లోని మారియట్ హోటల్‌లో బస చేసిన ప్రిన్స్ అబ్దుల్లా.. కొన్నిరోజుల తర్వాత తన గదిలోని బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో కనిపించారు. హోటల్ సిబ్బంది వెంటనే అత్యవసర వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చినా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. ప్రిన్స్‌కు ప్రాణాంతకమైన ఇతర ఆరోగ్య సమస్యలు ఏవీ లేవని వైద్యులు తెలిపారు. అయితే, ఆల్కహాల్, గామా-హైడ్రాక్సీబ్యూటిరేట్, జానాక్స్ తదితర పదార్థాల కలయిక శరీరంపై తీవ్ర ప్రభావం చూపి గుండె పనితీరును దెబ్బతీసి మరణానికి దారితీసినట్లు నిపుణులు కోర్టుకు వివరించారు.

కోర్టు విచారణలో మరో కీలక విషయం కూడా బయటపడింది. ప్రిన్స్ అబ్దుల్లా గత కొంతకాలంగా మద్యం, జానాక్స్ వ్యసనంతో బాధపడుతున్నారని, మరణానికి సుమారు నెల రోజుల ముందు పునరావాస కేంద్రంలో చికిత్స పూర్తి చేసి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడైంది. దర్యాప్తు అధికారులు సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించిన తరువాత ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం, హత్యకు సంబంధించిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. దీంతో కోర్టు ఈ మరణాన్ని అనుకోకుండా జరిగిన ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేశారు.