SalmaAlShehab
Saudi woman: సౌదీలో అసమ్మతి నేతల ట్వీట్లను రీ ట్వీట్ చేశారని అభియోగాలతో సౌదీ అరేబియాలో 34ఏళ్ల ఓ మహిళలకు కోర్టు 34ఏళ్ల జైలు శిక్ష విధించింది. సల్మా అల్ షెబాబ్ సౌదీలో మైనార్టీగా ఉన్న షియా ముస్లిం వర్గానికి చెందిన మహిళ. ఆమె బ్రిటన్ లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే 2021 జనవరిలో సెలవుల నిమిత్తం ఆమె బ్రిటన్ నుంచి సౌదీకి వచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ట్వీట్ల ద్వారా వందతులను ప్రచారం చేసిందని, సౌదీలో అసమ్మతి నేతల ట్వీట్లను రీ ట్వీట్ చేసిందని అభియోగాలు మోపారు. వీటిపై విచారణ జరిపిన కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తీర్పును ఆమె పై కోర్టులో సవాల్ చేయగా.. పై కోర్టు 34ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
సౌదీ అరేబియా మహిళ హక్కుల కోసం పోరాటం చేస్తున్న సల్మాకు సుదీర్ఘ జైలు శిక్ష విధించడం పట్ల అంతర్జాతీయగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆమెను విడుదల చేయాలని మానవ హక్కుల పరిరక్షణ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. మహిళా హక్కుల కార్యకర్తలకు సంఘీభావంగా ట్వీట్ చేయడం నేరం కాదని ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉంటే 34ఏళ్ల ఇద్దరు పిల్లల తల్లి అయిన సల్మా అల్-షెహాబ్ కేసుతో సౌదీలో మహిళల హక్కుల పరిస్థితి మెరుగవడం లేదు, కానీ రోజురోజుకు మరింత దిగజారుతోందని మానవ హక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Report I #SaudiArabia: 34 years sentence against the women's right activist #SalmaAlShehab
? Read here: https://t.co/1S7sMV0gxY pic.twitter.com/ATjTREgxJM
— ESOHR (@ESOHumanRightsE) August 16, 2022
ఇదిలాఉంటే లండన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం, సౌదీ మీడియా మంత్రిత్వ శాఖ అల్-షెహాబ్ కేసు వివరాలను, ఆ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. లీడ్స్ యూనివర్శిటీ ప్రతినిధి మాట్లాడుతూ.. సల్మా విషయంలో ఇటీవలి పరిణామం గురించి తెలిసి మేము చాలా ఆందోళన చెందామన్నారు. మేము ఆమెకు మద్దతు ఇవ్వడానికి ఏదైనా చేయగలమా అనే దానిపై సలహాలను కోరుతున్నామని అన్నారు. ఇదిలాఉంటే అల్-షెహబ్ కేసుపై వ్యాఖ్యానించడానికి ట్విట్టర్ నిరాకరించింది.