Finland PM Sanna Marin: ఫిన్లాండ్ ప్రధాని వీడియో వైరల్.. తాను ఏ తప్పు చేయలేదంటూ వివరణ.. ఆమెకు ఆ టెస్ట్ చేయాలంటూ ప్రతిపక్షాల డిమాండ్

ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఓ పార్టీలో మిత్రులతో కలిసి చేసిన డ్యాన్స్ వివాదానికి దారితీసింది.

Finland PM Sanna Marin: ఫిన్లాండ్ ప్రధాని వీడియో వైరల్.. తాను ఏ తప్పు చేయలేదంటూ వివరణ.. ఆమెకు ఆ టెస్ట్ చేయాలంటూ ప్రతిపక్షాల డిమాండ్

Finland PM Sanna Marin

Updated On : August 19, 2022 / 7:42 AM IST

Finland PM Sanna Marin: ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఓ పార్టీలో మిత్రులతో కలిసి చేసిన డ్యాన్స్ వివాదానికి దారితీసింది. ప్రధాని పార్టీలో ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసిన వీడియో లీక్ కావడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సనా తన స్నేహితులతో కలిసి రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. అయితే ఈ సమయంలో ఆమె డ్రగ్స్ తీసుకొందని అక్కడి ప్రతిపక్షాలు విమర్శల దాడికి దిగాయి. ప్రధాని హోదాలో ఉండి ఇలా వ్యవహరించడం సరైంది కాదని, ఆమెకు వెంటనే డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

China New Mission: చైనా మరో ఎత్తుగడ.. హిందూ మహాసముద్రంలో పట్టు కోసం కుయుక్తులు..

వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రధాని సనా మారిన్ స్పందించారు.. వీడియోలో ఉంది తానేనని, స్నేహితులతో ప్రైవేట్ పార్టీ సందర్భంగా డ్యాన్స్ చేసినట్లు వివరణ ఇచ్చారు. డ్యాన్స్ చేసే సమయంలో నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కానీ తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ఈ పార్టీ వీడియో లీక్ కావడం దురదృష్టకరమని, అయినా తాను ఏ తప్పూ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

పార్టీ సమయంలో తాను మద్యం తీసుకున్న మాట వాస్తవమేనని, మేం చేసినవన్నీ చట్టానికి లోబడినవే అంటూ ఆమె పేర్కొన్నారు. అయితే తాను స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో పబ్లిక్ లోకి వెళ్లడం బాధగా ఉందని అన్నారు. ఇది పూర్తిగా చట్టబద్ధమైనదని, తన ప్రవర్తనలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నానని, ఎప్పుడూ అలాగే ఉంటానంటూ తనపై విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీల నేతలకు ప్రధాని సనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.