China New Mission: చైనా మరో ఎత్తుగడ.. హిందూ మహాసముద్రంలో పట్టు కోసం కుయుక్తులు..

చైనా భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకా స్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

China New Mission: చైనా మరో ఎత్తుగడ.. హిందూ మహాసముద్రంలో పట్టు కోసం కుయుక్తులు..

China

China New Mission: చైనా భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకా స్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. హిందూ మహాసముద్రంలో పట్టు బిగించటమే లక్ష్యంగా ఈ కుయుక్తులు పన్నుతోంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో నౌకా స్థావరాన్ని 2016లో చైనా 590 మిలియన్ డాలర్లు వెచ్చించి నిర్మించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకంగా భావించే సూయజ్ కాలువ మార్గంలో ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ను వేరుచేసే వ్యూహాత్మక బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి వద్ద ఈ స్థావరం ఉంది. ప్రత్యక్ష దాడిని తట్టుకొనేలా దీన్ని నిర్మించినట్లు సమాచారం.

Power Cuts For Telugu States : తెలుగు రాష్ట్రాలకు కరెంట్ కట్? కేంద్రం ఆంక్షలతో ఏపీ, తెలంగాణకు పొంచి ఉన్న విద్యుత్ గండం?

అయితే డ్రాగన్ ఇప్పుడు అక్కడ యుజావో యుద్ధనౌకను మోహరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. 25వేల టన్నుల బరువు, 800 మంది సైనిక సామర్థ్యం గల ఈ నౌకపై వాహనాలతో పాటు జెట్ ఫైటర్లను మోహరించవచ్చు. ఇది ట్యాంకులు, ట్రక్కులు, హోవర్ క్రాప్ట్ లను కూడా మోయగలదు. ఈ నౌక ద్వారా భారత్ కు సంబంధించిన కీలక ఉపగ్రహ సమాచారాన్ని సేకరించే ప్రమాదముంది.

China-Taiwan conflict: తైవాన్ విషయంలో మరో నిర్ణయం తీసుకుని చైనాకు అసహనం తెప్పించిన అమెరికా

సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాద చొరబాట్ల గుర్తింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి భారత నిఘా వ్యవస్థ చేపడుతున్న చర్యలను డ్రాగన్ పర్యవేక్షించే ముప్పు ఉన్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. చైనా ఇటీవలే శ్రీలంకలోని హంబన్ టోటా ఓడరేవులో 25వేల టన్నుల యువాన్ వాంగ్ యుద్ధ నౌకను మోహరించిన సంగతి తెలిసిందే.