China-Taiwan conflict: తైవాన్ విషయంలో మరో నిర్ణయం తీసుకుని చైనాకు అసహనం తెప్పించిన అమెరికా

తైవాన్ విషయంలో చైనా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అమెరికా మరో నిర్ణయం తీసుకుంది. తైవాన్ తో వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలు జరుపుతామని అమెరికా ప్రకటించింది. తైవాన్-తమ దేశానికి మధ్య వాణిజ్య రంగంలో సహకారం కొనసాగించడానికి ఈ చర్చలు జరుపుతామని అమెరికా వాణిజ్య రంగ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. తైవాన్ తో అమెరికాకు అధికారంగా ఎలాంటి సత్సంబంధాలూ లేవు. అయితే, తైవాన్ లోని అమెరికా అనధికారిక సంస్థ ద్వారా సంప్రదింపులు జరుపుతోంది.

China-Taiwan conflict: తైవాన్ విషయంలో మరో నిర్ణయం తీసుకుని చైనాకు అసహనం తెప్పించిన అమెరికా

China-Taiwan conflict

China-Taiwan conflict: తైవాన్ విషయంలో చైనా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అమెరికా మరో నిర్ణయం తీసుకుంది. తైవాన్ తో వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలు జరుపుతామని అమెరికా ప్రకటించింది. తైవాన్-తమ దేశానికి మధ్య వాణిజ్య రంగంలో సహకారం కొనసాగించడానికి ఈ చర్చలు జరుపుతామని అమెరికా వాణిజ్య రంగ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. తైవాన్ తో అమెరికాకు అధికారంగా ఎలాంటి సత్సంబంధాలూ లేవు. అయితే, తైవాన్ లోని అమెరికా అనధికారిక సంస్థ ద్వారా సంప్రదింపులు జరుపుతోంది.

త్వరలో వ్యవసాయం, కార్మికులు, పర్యావరణం, డిజిటల్ టెక్నాలజీ, మార్కెట్ యేతర విధానాలపై చర్చలు జరుగుతాయని అమెరికా స్పష్టం చేసింది. తైవాన్‌ చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు చేపడుతూ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా మరోసారి తైవాన్ కు మద్దతుగా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.

చైనా కొన్ని రోజుల పాటు సైనిక విన్యాసాలు చేపట్టింది. అయినప్పటికీ, నాలుగు రోజుల క్రితం యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందం నిన్న తైవాన్‌కు చేరుకుని పర్యటించింది. కీలక అంశాలపై తైవాన్ తో చర్చలు జరిపింది. దీంతో తైవాన్ చుట్టూ చైనా మరోసారి యుద్ధ విన్యాసాలు చేపట్టింది. తైవాన్ తమ భూభాగమని చైనా వాదిస్తోంది.

Kabul mosque attack: అఫ్గాన్‌లో బాంబు పేలుళ్ళు.. 20 మంది మృతి.. 40 మందికి గాయాలు