Sea Snail : ప్రపంచంలో ఎన్నో వింతలు..మరెన్నో విచిత్రాలు. జీవుల్లో ఎంత అందమైనవి ఉంటాయో అన్ని ప్రత్యేకమైనవికూడా ఉంటాయి. కొన్ని జీవులు తోక తెగినా బతికేస్తాయి. మరికొన్ని కొన్ని అవయవాలను కోల్పోయి కూడా జీవిస్తాయి. కానీ ఏకంగా తల తెంచేసుకుని తిరిగి మరింత ఫ్రెష్ గా తన శరీరాన్ని పెంచుకని జీవించే జీవి గురించి ఎప్పుడైనా చూశారా? పోనీ కనీసం అటువంటి ఓ జీవి ఉందనే మాట విన్నారా? అంటే లేదనే అంటాం.అటువంటి అరుదైన అద్భుతమైన జీవి ఉంది. అదే ‘నత్త’ సాకోగ్లోస్సాన్ వర్గానికి చెందిన సముద్ర నత్త తన తలను తెంచేసుకుని తన శరీరాన్ని పెంచుకుని జీవిస్తుంది. ఈ విషయాన్ని జపాన్ యూనివర్శిటీ సైంటిస్టులు కనిపెట్టారు.
రెండు వారాల్లోనే..శరీరాన్ని పెంచేసుకుంటుంది
సాధారణంగా బల్లులు, కొన్నిరకాల చేపలు, చిన్న జంతువులు అవయవాలు కోల్పోతే.. తిరిగి పెంచుకుని తిరిగి సాధారణ జీవితాన్ని కొనసాగిస్తాయి. వాటి కాళ్లు, తోక వంటివి ఏదో ఒక అవయవాలకు ఇటువంటి శక్తి ఉంటుంది. దీనినే ఆటోటోమీ అంటారు.
అయితే ఏదో ఒక అవయవం కాకుండా ఏకంగా తల ఒక్కదాని నుంచే.. మెడ సహా మొత్తం శరీరాన్ని మళ్లీ పెంచుకునే శక్తి సాకోగ్లోస్సాన్ వర్గానికి చెందిన సముద్ర నత్తలకు ఉందని జపాన్‌లోని నారా విమెన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా మనుషులకైనా జంతువులకైనా జీవులకైనా తల ప్రధానం. అదే ప్రాణం నిలవటానికి ఓ ప్రధానం అని చెప్పాలి. కానీ సాకోగ్లోస్సాన్ వర్గానికి చెందిన సముద్ర నత్తలకు ఫుల్ డిఫరెంట్ జీవి.
అలా తల తెంచుకుని శరీరాన్ని పెంచుకోవటానికి ఈ నత్తకు పెద్ద టైం పట్టదట. కేవలం రెండు వారాల నుంచి నెల రోజుల్లోపే శరీరం మొత్తం తయారైపోతుందని సైంటిస్టులు వారి పరిశోధనల్లో కనుగొన్నారు. ఈ నత్త తలలో ఉండే కణాలు.. శరీరంలోని ఏ భాగంగానైనా అభివృద్ధి చెందే శక్తిగలవని (స్టెమ్‌సెల్స్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎందుకు తల తీసేసుకుంటాయంటే?!
సముద్రంలో చేపలు, పీతలు, పాములు వంటి జంతువులు ఈ నత్తలను ఆహారంగా తినస్తాయి. అటువంటిసమయాల్లో ఈ నత్తలు బతకటానికి ఈ నత్తలు వాటి తల కింద భాగాన్ని తెంచేసి వదిలేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. నత్తలు తమ శరీరానికి ఫంగస్, బ్యాక్టీరియా, ఇతర పారసైట్స్ సంక్రమించినప్పుడు కూడా ఇలా శరీరాన్ని వదిలేస్తాయని చెబుతున్నారు.
అలా ఆ తల తన శరీరాన్ని తిరిగి నిర్మించుకుంటుంది. అదేనండీ పెంచుకుంటుంది..భలే గుంది కదూ..ఈ వింత నత్త వింత జీవితం..లేదంటే అవి పలు సముద్ర జీవులకు ఆహారంగా మారి ఎప్పుడో అంతరించిపోయేవేమో..చూశారా? ఈ సృష్టి ఎంత చిత్రమైనదో..!!