ఆ 7 వారాల్లో చైనాలో ఏం జరిగింది?
కరోనా వైరస్ ప్రబలుతోంది... అడ్డుకోవాల్సిన చైనా మహమ్మారిని రహస్యంగా ఉంచాలనుకుంది... ఇప్పుడు మూల్యం చెల్లిస్తోందా?

కరోనా వైరస్ ప్రబలుతోంది… అడ్డుకోవాల్సిన చైనా మహమ్మారిని రహస్యంగా ఉంచాలనుకుంది… ఇప్పుడు మూల్యం చెల్లిస్తోందా?
కరోనా వైరస్ ప్రబలుతోంది… అడ్డుకోవాల్సిన చైనా మహమ్మారిని రహస్యంగా ఉంచాలనుకుంది… ఇప్పుడు మూల్యం చెల్లిస్తోందా? కరోనా కోరలకు చిక్కిన చైనాలో ఏం జరిగిందో, ఎం చేస్తున్నారో మనకు తెలియాలంటే ఒక్కటే మార్గం… వాళ్ల అధికారులు చెప్పింది నమ్మడం…నోట్ చేసుకోవడం. విపత్కర పరిస్థితుల్లోనూ చైనా రహస్య పద్ధతుల్లోనే పనిచేస్తోంది. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలేదు. దీనివల్ల ప్రజల్లో అనుకున్నంత అవగాహనలేదు. ప్రపంచం ముందు రాజకీయంగా చులకనైపోతామన్న భయంతో… చైనా ముందుకురావడంలేదు.
వుహాన్ నగరంలో అంతుచిక్కని వైరస్ బారిన ఏడుగురు పడగానే… చైనా డాక్టర్…వెంటనే ఎమర్జెన్సీ విభాగాన్ని క్వారంటీన్ (దిగ్భందం) చేద్దాం. మిగిలిన వాళ్లను దూరంగా ఉంచుదామని డిసెంబర్ 30న ఆన్ లైన్ చాట్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. అతని పేరు డాక్లర్ లీ. భయపడాల్సిందేనని మరో డాక్టర్ రిప్లై ఇచ్చాడు. 2002 నాటి సార్స్ మళ్లీ వస్తోందాన్న భయం మిగిలినవాళ్లు వ్యక్తం చేశారు. ఈ సంగతి తెలిసిన వైద్య అధికారులు లీని అర్ధరాత్రి పిలిపించారు. ఎందుకు ఈ విషయాన్ని పోస్ట్ చేశావని అడిగారు. మూడు రోజుల తర్వాత పోలీసులు ఒత్తిడి చేసి లీతో ఈ సమాచారాన్ని ఇల్లీగల్ బిహేవియర్ తోనే పోస్ట్ చేశానన్న స్టేట్ మెంట్ మీద సంతకం చేయించుకున్నారు.
మొదట చైనా అధికారులు అనుకున్నట్లుగా అది సార్స్ కాదు. అలాంటిదే కాని… వుహాన్ సిటీ హద్దులను దాటేసింది. ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ఫిలిపైన్స్ లో మొదటి కరోనావైరస్ మరణం నమోదైంది. ఇప్పటికి 300 మంది చనిపోతే.. 14,300 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. పరువు ప్రతిష్టల కోసం చైనా పాకులాడటంతోనే ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో తొలి రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలను ఆలస్యం చేశారు.
క్లిష్టపరిస్థితుల్లో ప్రజలకు కరొనా వైరస్ గురించి అప్రమత్తం చేసినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. దానికి బదులు అంతుపట్టని వైరస్ ను రహస్యంగా దాచాలనుకున్నారు. ఇప్పుడు ప్రపంచం ముందు చైనాను దోషిగా నిలబెట్టింది. రాజకీయంగా పరువు తీసింది. డాక్టర్ లీ మొదట కనిపిట్టిన నాటి నుంచి వుహాన్ సిటీని లాక్ చేయాలన్న నిర్ణయం తీసుకోవడం వరకు మధ్య ఏడువారాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వూహాన్ ప్రజలు, వైద్యాధికారులు, అధికారులతో మాట్లాడిన తర్వాత… ఈ ఏడువారాల్లో ఏం జరిగిందో అంచనా వేస్తున్నారు. ఈ ఏడువారాల్లో వైరస్ గురించి ఎర్రజెండా ఎగరేసిన వైద్యులను అధికారులు నోరుమూయించారు.
కోటి పది లక్షల మంది జనాభా ఉన్న వుహాన్ సిటీలో SARS లాంటి వైరస్ వచ్చిందని తెలిస్తే ఎంతటి ఆందోళన రేగుతుందో తెలుసు. అందుకే కొత్త వైరస్ గురించి జనం భయపడినా… అంతా కట్టడి చేశాం… ప్రమాదం ఏమీ లేదని అధికారులు నచ్చజెప్పారు. వైరస్ పుట్టిందనుకున్న మార్కెట్ ను చైనా మూసివేసింది. ఎందుకని అడిగేతే… మరమ్మత్తులని చెప్పారు తప్ప… వైరస్ గురించి బయటపెట్టలేదు. గత జనవరిలోనే అక్కడ అధికార పార్టీ అత్యున్నతస్థాయి సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. వైరస్ వల్ల కాంగ్రెస్ అగిపోతే పరువుపోతుందని అనుకున్నారు స్థానిక అధికారులు.
వైరస్ బారిన పడిన వాళ్ల గురించి సమాచారం బైటకు వచ్చినా… కొత్తగా ఎవరికి సోకడంలేదని చెప్పుకొచ్చారు. ఎదైనా సమస్య ముంచుకొస్తుందంటే ధైర్యంగా పోరాడే చైనా… కరోనా గురించి మాత్రం ఆలస్యం చేసింది. దారుణంగా దెబ్బతింది. నిజంగా మొదటి కరోనా వైరస్ ఎప్పుడు ఎవరికి సోకిందో కచ్చితమైన డేట్ లేకపోయినా… డిసెంబర్ మొదటి వారంలో అని మాత్రం మనకు తెలుసు. ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి వుహాన్ సిటీని దిగ్బంధించింది మాత్రం జనవరి 20వ తేదీన. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. వుహాన్ కరోనా చేతికి చిక్కింది. మిగిలిన ప్రాంతాలకు వ్యాపించింది.
2019 చివరి రోజు, డాక్టర్ లీ మెసేజ్ బయటకొచ్చిన తర్వాత… పరిస్థితిని అదుపుచేయడానికి అధికారులు ప్రయత్నించారు. అసలు జరిగిందో అన్నదాన్ని తమకు నచ్చినట్లు వక్రీకరించారు. మహమ్మారి గురించి పుకార్లు వ్యాప్తిచేస్తున్న ఏడుగురిని పట్టుకొంటామని అన్నారు. చైనాకున్న అసలు సమస్య ఇదే.
Read Also : కరోనాను మొదట కనుగొన్న డాక్టర్.. ఆ వైరస్‌కే బలైపోయాడు!