×
Ad

Video: విమానం కుప్పకూలి చెలరేగిన మంటలు.. ఏడుగురి మృతి

విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.

Mexico Plane Crash

Video: మెక్సికోలోని సాన్ మాటియో అటెన్కోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో ఓ చిన్న ప్రైవేట్ జెట్ కుప్పకూలిపోయింది. అది ఒక భవనం పైకప్పును ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఈ విమానం అకపుల్కో నుంచి టోలూకా విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. టోలూకా విమానాశ్రయం మెక్సికో సిటీకి పశ్చిమాన సుమారు 31 మైళ్ల దూరంలో ఉంది. ప్రమాదస్థలి విమానాశ్రయానికి సుమారు 3 మైళ్ల దూరంలో పారిశ్రామివకవాడలో ఉంది.

Also Read: న్యూ ఇయర్ వేడుకకు ప్లాన్ వేసుకుంటున్నారా? పర్మిషన్లు తీసుకోవడానికి 21 నుంచి అప్లికేషన్లు

మెక్సికో రాష్ట్ర సివిల్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ అడ్రియన్ హెర్నాండెజ్ తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అయితే, ప్రమాదం జరిగిన కొన్ని గంటల తరువాత ఏడు మృతదేహాలే లభించాయి.

విమానం ఒక సాకర్ మైదానంలో ల్యాండ్ కావాలని ప్రయత్నించింది. కానీ, సమీప వ్యాపార సంస్థకు చెందిన లోహపు పైకప్పును ఢీకొనడంతో మంటలు చెలరేగాయని అధికారులు వివరించారు.

“అగ్నిప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో సుమారు 130 మందిని తరలించాల్సి వచ్చింది” అని సాన్ మాటియో అటెన్కో మేయర్ అనా మునిజ్ తెలిపారు.