కత్తితో వరుసగా పొడిచి ఏడుగురిని హతమార్చిన నిందితుడు

కత్తితో వరుసగా పొడిచి ఏడుగురిని హతమార్చిన నిందితుడు

Knife-attack

Updated On : December 28, 2020 / 9:52 AM IST

Knife attack: పోలీసుతో సహా ఏడుగురిని కత్తితో వరుసగా పొడిచిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లియానింగ్ ప్రావిన్స్‌లోని కైయువాన్ ఘటన జరిగింది. జినువా న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన దానిని బట్టి.. ఒకే వ్యక్తి వరుసగా ఏడుగురిని పొడుచుకుంటూ వెల్లిపోయాడు.

చైనాలో ఇటువంటి హింసాత్మక క్రైంలు ఘటనలు జరగడం చాలా అరుదు. ఇటీవల ఇలా జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఇలా చేసే వారి మానసిక పరిస్థితి ప్రతీకారం తీర్చుకోవాలని లేదా.. ఏదైనా మనో వ్యధతో బాధపడుతూ ఉండొచ్చు.

ఉదయం 8గంటలకు జరిగిన ఘటనకు పోలీసులకు షాక్ అయ్యారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన సమాచారం మేరకు ఓ స్కూల్ బయట మధ్య వయస్కులు, వృద్ధులపైనే దాడి జరిపినట్లు తెలుస్తోంది. ఆదివారం స్కూల్‌కు సెలవు కావడంతో పెద్దగా ప్రమాదాలు జరగలేదు. లేదంటే బాధితులు ఇంకా పెరిగేవారని లూయి అనే స్థానికురాలు చెబుతుంది.