Afghanistan Bomb blasts : అప్ఘానిస్థాన్ లో వరుస బాంబు పేలుళ్లు..18 మంది మృతి, 65 మందికి తీవ్ర గాయాలు

అఫ్ఘానిస్థాన్ మరోసారి మరోసారి బాంబులతో దద్దరిల్లింది. కాబుల్‌తో సహా ఐదు చోట్లు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 65మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Several Bomb Blast In Afghanistan Including Kabul.

Afghanistan: అఫ్ఘానిస్థాన్ మరోసారి మరోసారి బాంబులతో దద్దరిల్లింది. కాబుల్‌తో సహా ఐదు చోట్లు పేలుళ్లు సంభవించాయి. ప్రార్థనా మందిరంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు జరిగాయి. ఈ బాంబు దాడుల్లో 18 మంది మరణించారు. మరో 65 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగ్రాతులను వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు.

మజార్-ఎ-షరీఫ్ మసీదుతో పాటు.. కాబూల్, నంగర్హర్, కుందుజ్‌లలో కూడా పేలుళ్లు జరిగాయి. మసీదులో పేలుళ్లు జరిగాయి. కాబుల్‌ సహా ఒకేసారి పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరగడంతో ఆఫ్గనిస్తాన్‌ ఒక్కసారిగా వణికిపోయింది. ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కాగా..తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత కూడా అఫ్ఘానిస్థాన్ లో బాంబు పేలుళ్లు జరుగుతునే ఉన్నాయి. ఏప్రిల్‌ 19న ఆఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. మూడు ప్రదేశాల్లో జరిగిన బాంబు పేలుళ్లలో 25 మంది స్కూల్‌ విద్యార్ధులు మృతి చెందారు. ఈ బాంబు పేలుళ్ల వేకన ఐసిస్‌ ఉగ్రముఠాల హస్తమున్నట్లు వార్తలు వచ్చాయి.