Snow Storm In America: వణుకుతున్న ఉత్తర అమెరికా.. వాహనాల్లో గడ్డకట్టిన మృతదేహాలు ..

నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. ఫ్లోరిడాలోని మయామి, టంపా, ఒర్లాండో, వెస్ట్ పామ్ బీచ్‌లు 1983 తరువాత అత్యల్ప ఉష్ణోగ్రతలు డిసెంబర్ 25న నమోదయ్యాయి. న్యూయార్క్ లోని బఫెలోను చలి ఎక్కువగా ఉండటంతో 43అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. పవర్ స్టేషన్ లో మంచు కురుస్తుండటంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. ఫలితంగా ఏడు లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Snow Storm In America

Snow Storm In America: ఉత్తర అమెరికాను మంచు తుపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మంచుతో అమెరికా, కెనాడాల్లోని పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిస్థాయి స్తంభించిపోయింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే గడ్డకట్టిపోతామా అనే పరిస్థితులు ఆ ప్రాంతాల్లో నెలకొన్నాయి. చలి తీవ్రతకు మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Snow Storm In America

ఇప్పటికే ఉత్తర అమెరికా ప్రాంతంలో 66 మంది వరకు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఒక్క బఫెలో నగరంలోని 34 మంది ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  మంచు తుపాను మునుపెన్నడూలేని స్థాయిలో ఉండటంతో వాహనాల్లో ఉన్నవారు గడ్డకట్టి మృతదేహాలుగా దర్శనమిస్తున్నారు. కార్లు, ఇళ్ల నుంచి వ్యక్తుల మృతదేహాలను బయటకు తీస్తున్నారంటే మంచు తుపాను విధ్వంసం ఏవిధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.

Snow Storm In America

నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. ఫ్లోరిడాలోని మయామి, టంపా, ఒర్లాండో, వెస్ట్ పామ్ బీచ్‌లు 1983 తరువాత అత్యల్ప ఉష్ణోగ్రతలు డిసెంబర్ 25న నమోదయ్యాయి. న్యూయార్క్ లోని బఫెలోను చలి ఎక్కువగా ఉండటంతో 43అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. పవర్ స్టేషన్ లో మంచు కురుస్తుండటంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. ఫలితంగా ఏడు లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Snow Storm In America

మంచు తుపా ప్రభావిత ప్రాంతాల్లో 70శాతం వరకు విమానాలు రద్దుచేస్తున్నారు. ఎక్కడికక్కడ రెస్టారెంట్లు, స్టోర్లు మూసివేశారు. దీంతో ఎవరైనా తమకు ఆహారం అందించాలని న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగర ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థిస్తున్నారు. ప్లోరిడాలోసైతం మునుపెన్నడూ లేనిరీతిలో చలితీవ్రత ఉండటంతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు