Shinzo Abe: విషమంగా జపాన్ మాజీ పీఎం పరిస్థితి

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే వెస్టరన్ జపాన్ లోని నారా సిటీలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిపారు. ఛాతీపై కాల్పులు జరపడంతో కుప్పుకూలినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి శుక్రవారం తెలిపారు. షింజో అబే తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే వెస్టరన్ జపాన్ లోని నారా సిటీలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి. ఛాతీపై కాల్పులు జరపడంతో కుప్పకూలినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి శుక్రవారం తెలిపారు. షింజో అబే తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

పడిన వెంటనే ఎటువంటి రియాక్షన్ కనబరచలేదని , పల్మనరీ కార్డియాక్ అరెస్ట్‌కు గురై ఉండొచ్చని స్థానిక మీడియా భావిస్తుంది.

“మాజీ ప్రధాని అబేను నారాలో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కాల్చారు. షూటర్‌గా భావిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది” అని జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సునో చెప్పారు.

40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అబేను వెనుక భాగంలో కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

అబే ప్రసంగం సమయంలో వరుసగా రెండుసార్లు చప్పుడు వినిపించింది. 67 ఏళ్ల షింజో అబే రెండవ షాట్ పేలడంతో కుప్పకూలిపోయాడు. అతను వెనుక నుంచి కాల్పులు జరిపారు. నిందితుడి దగ్గర షాట్‌గన్‌ ఉండొచ్చని భావిస్తున్నారు.

జపాన్‌లో తుపాకీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ కాల్పులు చాలా అరుదుగా నమోదవుతుంటాయి.

జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి షింజో అబే, 2006లో ఒక సంవత్సరం పాటు పదవిలో కొనసాగారు. మళ్లీ 2012 నుండి 2020 వరకు పదవిలో ఉన్నారు. అల్సరేటివ్ కొలిటిస్ కారణంగా పదవీవిరమణ చేయాల్సి వచ్చింది.

 

ట్రెండింగ్ వార్తలు