Virginia Walmart Shooting: కాల్పుల మోతతో దద్దరిల్లిన వర్జీనియా.. వాల్‌మార్ట్ స్టోర్‌లో దుండగుడు కాల్పులు.. 10 మంది మృతి

అమెరికాలోని వర్జీనియాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో 10మందికిపైగా మరణించినట్లు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.12గంటల సమయంలో చెసాపిక్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డాడు.

Virginia Walmart Shooting: అమెరికాలోని వర్జీనియాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో 10మందికిపైగా మరణించినట్లు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.12గంటల సమయంలో చెసాపిక్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ప్రజలు భయంతో కేకలువేస్తూ పరుగులు పెట్టారు.

Nigeria Road Accident: నైజీరియాలో ఢీకొన్న మూడు బస్సులు.. 37మంది మృతి

చెసాపిక్ పోలీస్ విభాగం అధికార ప్రతినిధి లియో కొసినిస్కీ మాట్లాడుతూ.. విచక్షణారహితంగా కాల్పులు జరిపి పలువురు మృతికి కారణమైన దుండగుడిని హతమార్చినట్లు తెలిపారు. దుండగుడు దాదాపు సుమారు అర్ధగంట పాటు కాల్పులు జరిపాడని, ఈ కాల్పుల్లో 10మంది కంటే ఎక్కువ మంది మరణించలేదని తాము విశ్వసిస్తున్నామని తెలిపాడు.

వర్జీనియా రాష్ట్ర సెనేటర్ లూయిస్ లూకాస్ మాట్లాడుతూ.. ఈ రాత్రి వర్జీనియాలోని చెసాపిక్ లోని వాల్ మార్ట్ లో దుండగుడు కాల్పులు జరపడం తనను దిగ్భ్రాంతికి గురిచేసింది. మన దేశంలో చాలా మంది ప్రాణాలను తీసిన ఈ తుపాకీ హింస మహమ్మారిని అంతం చేయడానికి పరిష్కారాలను కనుగొనే వరకు నేను విశ్రమించను అని ఆమె ట్విటర్ లో పేర్కొంది.

ఇదిలాఉంటే.. DailyMail.comలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. కాల్పులు జరిపిన వ్యక్తి వాల్‌మార్ట్ స్టోర్ మేనేజర్ అని సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తులు చెప్పారు. మేనేజర్ బ్రేక్ రూమ్‌లోకి ప్రవేశించి ఇతర స్టోర్ ఉద్యోగులపై కాల్పులు జరిపాడని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు