Shumukh Perfume : వావ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘షుముఖ్’ పెర్ఫ్యూమ్.. వజ్రాలు, బంగారంతో పొదిగి.. ఖరీదు రూ. 11 కోట్లు..!

Shumukh Perfume : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పరిమళ ద్రవ్యాలలో షుముఖ్ పెర్ఫ్యూమ్ ఒకటి. 3 లీటర్ల క్రిస్టల్ బాటిల్ స్వచ్ఛమైన వెండి, 18-క్యారెట్ల బంగారం, 3,571 కన్నా విలువైన రాళ్లతో అలంకరించారు.

Shumukh Perfume : వావ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘షుముఖ్’ పెర్ఫ్యూమ్.. వజ్రాలు, బంగారంతో పొదిగి.. ఖరీదు రూ. 11 కోట్లు..!

Shumukh Perfume

Updated On : July 4, 2025 / 11:47 PM IST

Shumukh Perfume : సువాసనలు వెదజల్లే ఎన్నో రకాల పెర్ఫ్యూమ్స్ చూసి ఉంటారు. కానీ, ఇలాంటి పెర్ఫ్యూమ్ ఎప్పుడూ చూసి ఉండరు. షుముఖ్ పెర్ఫ్యూమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. మీరు ఇప్పటివరకు చూడని అత్యంత ఖరీదైన పెర్ఫ్యూమ్ ఏదైనా ఉందంటే అది ఇదే.. ఈ షుముఖ్ పెర్ఫ్యూమ్ ప్రత్యేకత ఏంటో తెలుసా? స్వచ్ఛమైన బంగారం, వెండి, ఖరీదైన రాళ్లతో పొదిగిన బాటిల్.. చూసేందుకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ అద్భుతమైన షుముఖ్ పెర్ఫ్యూమ్ బాటిల్‌ను దుబాయ్ నగరంలో నబీల్ పెర్ఫ్యూమ్స్ వ్యవస్థాపకుడు, సుగంధ ద్రవ్యాల తయారీదారు అస్గర్ ఆడమ్ అలీ రూపొందించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యునిసెక్స్ పెర్ఫ్యూమ్స్‌లో షుముఖ్ ఒకటి. ఈ పెర్ఫ్యూమ్ ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల పెడతారు.. అక్షరాలా AED 4.752 మిలియన్లు.. అంటే 1.295 మిలియన్ డాలర్లు.. అదే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 11 కోట్లు అనమాట.

అధికారిక (SHUMUKH) వెబ్‌సైట్ ప్రకారం.. దుబాయ్ సారాన్ని ఈ గాజు సీసాలో నింపేందుకు 3 ఏళ్లు 494 ట్రయల్స్ పట్టింది. కానీ, సాధారణమైన స్ప్రిట్జ్-అండ్-గో రకమైన పెర్ఫ్యూమ్స్ కాదు. షుముఖ్ ఒక భారీ 3-లీటర్ మురానో గాజు సీసాలో వస్తుంది. బ్లింగ్, 3,571 వజ్రాలు, 2.5 కిలోగ్రాముల 18-క్యారెట్ బంగారం, 5.9 కిలోగ్రాముల స్వచ్ఛమైన వెండి, అదనంగా ముత్యాలు, స్విస్ టోపాజ్‌తో నిండిన 1.97 మీటర్ల పొడవైన డిస్‌ప్లే కేసులో ఉంటుంది.

షుముఖ్ లగ్జరీకి పెట్టింది పేరు :
ఈ షుముఖ్ ఆభరణాలు, పరిమళ ద్రవ్యాలతో 7 ప్రధాన డిజైన్ అంశాల ద్వారా కళాఖండాన్ని సృష్టించారు. IGI, GIA ధృవీకరించిన 3,571 మెరిసే వజ్రాలు (మొత్తం 38.55 క్యారెట్లు), పుష్పరాగం, ముత్యాలు, 2479.26 గ్రాముల 18 క్యారెట్ల బంగారం, 5892.88 గ్రాముల స్వచ్ఛమైన వెండితో అమర్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. షుముఖ్ అనేది లగ్జరీకి పెట్టింది పేరు.

Read Also : Best Hybrid Cars : కొత్త కారు కొంటున్నారా? 2025లో భారత్‌లో బెస్ట్ హైబ్రిడ్ కార్లు ఇవే.. టాప్ మోడల్స్, ఫీచర్లు, మైలేజీ, ధర వివరాలివే..!

ఈ పెర్ఫ్యూమ్ స్వచ్ఛమైన భారతీయ అగర్వుడ్, ప్యాచౌలి, ధూపం, య్లాంగ్-య్లాంగ్, గంధపు చెక్క, స్వచ్ఛమైన టర్కిష్ గులాబీ, అంబర్ మిశ్రమంతో తయారైంది. బ్రాండ్ ప్రకారం.. షుముఖ్‌ను పరిపూర్ణంగా తయారీ చేసేందుకు 3 ఏళ్లు, 494 పెర్ఫ్యూమ్ ట్రయల్స్ పట్టింది.

Shumukh Perfume

Shumukh Perfume

దుబాయ్‌కి నివాళిగా బ్రాండ్ ముత్యాల డైవింగ్ (దుర్రా), ఫాల్కన్రీ (బాజ్), అరేబియా గుర్రాలు (అబ్జర్), గులాబీలు (నర్జేసి), లగ్జరీ (హైబా), అరేబియా ఆతిథ్యం (దివాన్), ఫ్యూచర్ సిటీ (ఆమల్)గా దుబాయ్ స్థాయిని ప్రదర్శించింది. ఇవన్నీ బంగారం, వెండితో రూపొందించారు. అత్యంత ఖరీదైన వజ్రాలు, విలువైన రాళ్లతో అలంకరించాం”అని బ్రాండ్ పేర్కొంది.

షుముఖ్ పేరిట 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు  :
ఇది కేవలం సువాసన కోసం మాత్రమే కాదు.. రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన మొట్టమొదటి పెర్ఫ్యూమ్ కూడా.  షుముఖ్ పెర్ఫ్యూమ్ బాటిల్‌పై అత్యధిక వజ్రాలు ఉండటం.. మరొకటి ఎత్తైన రిమోట్-కంట్రోల్డ్ పెర్ఫ్యూమ్ స్ప్రే సిస్టమ్‌గా ఉండటం. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. తనకు తానే స్ప్రే చేసుకుంటుంది..

ధర పరంగా పరిశీలిస్తే.. DKNY గోల్డెన్ డెలీషియస్ పెర్ఫ్యూమ్ షుముఖ్ పెర్ఫ్యూమ్ కన్నా తక్కువగా ఉంది. 2021లో జ్యూయెలరీ డిజైనర్ మార్టిన్ కాట్జ్ 2,909 విలువైన రాళ్లతో ప్రత్యేక ఎడిషన్ 3.4 ఫ్లూయిడ్-ఔన్స్ బాటిల్‌ను రూపొందించారు. హ్యూమనిటరేయన్ సంస్థ యాక్షన్ ఎగైనెస్ట్ హంగర్ కోసం నిధులు సేకరించడానికి రూపొందించారు.

షుముఖ్ ప్రస్తుతం దుబాయ్ మాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ పెర్ఫ్యూమ్ కొనుగోలుదారు ఎవరనేది తయారీదారులు ఇంకా ప్రకటించలేదు. అనేక మంది వచ్చి ఆసక్తిగా చూస్తున్నారని చెబుతున్నారు. ఎవరైనా నిజంగా ఈ షుముఖ్ పెర్ఫ్యూమ్ కొనుగోలు చేస్తారా లేదా చూడాలి.