Rare Lizard: వీడెవడండీ బాబూ.. అరుదైన బల్లిని వండి, ఆన్‌లైన్‌లో వీడియో పోస్ట్.. ఆ తర్వాత అసలు కథ షురూ..

అసనబాని గ్రామానికి చెందిన రూప నాయక్ అనే వ్యక్తి ఇటీవల భద్రఖ్‌ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో బంటా ప్రాంతం వద్ద రోడ్డుపక్కన అతడు చనిపోయిన ఓ అరుదైన బల్లిని చూశాడు.

Rare Lizard: వీడెవడండీ బాబూ.. అరుదైన బల్లిని వండి, ఆన్‌లైన్‌లో వీడియో పోస్ట్.. ఆ తర్వాత అసలు కథ షురూ..

Rare Lizard

Updated On : August 21, 2025 / 8:27 AM IST

Rare Lizard: ఒడిశా మయూర్భంజ్ జిల్లాకు చెందిన ఓ యూట్యూబర్ అరుదైన రకం బల్లిని పట్టుకుని, దాని మాంసాన్ని వండాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి, అరెస్ట్ అయ్యాడు.

అసనబాని గ్రామానికి చెందిన రూప నాయక్ అనే వ్యక్తి ఇటీవల భద్రఖ్‌ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో బంటా ప్రాంతం వద్ద రోడ్డుపక్కన అతడు చనిపోయిన ఓ అరుదైన బల్లిని చూశాడు.

దానిని ఇంటికి తీసుకెళ్లి వండి, వీడియో తీశాడు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. (Rare Lizard)

Also Read: Gold Rates: బంగారం కొంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

ఆ వీడియో వైరల్ కావడంతో అటవీ శాఖ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై స్వయంగా దర్యాప్తు ప్రారంభించిన అధికారులు రూప నాయక్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన చర్యను ఒప్పుకున్నాడు.

అతనిపై వన్యప్రాణి రక్షణ చట్టం 1972లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వీటిలో సెక్షన్ 2(16)(a)(b), 9, 39(1)(b), 48(a)(b), 50(1) ఉన్నాయి. ఈ కేసు థాకుర్‌ముందా అటవీ పరిధిలో నమోదైంది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.

భారతదేశంలో వన్యప్రాణులు, వాటి నివాసాలను రక్షించేందుకు రూపొందించిన చట్టమే వన్యప్రాణి రక్షణ చట్టం 1972.