Brother meets sister after 75 years: 75 ఏళ్ల తర్వాత చెల్లిని కలిసిన అన్న.. ఆనందానికి అవధులు లేవు

అన్న భారత్ లోని పంజాబ్, జలంధర్ లో ఉంటున్నాడు. చెల్లి పాకిస్థాన్ లో ఉంటోంది. వారిద్దరు 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. మళ్ళీ ఒకరినొకరు చూసుకుంటామని అనుకోని ఆ అన్నాచెల్లెళ్లు ఇన్నేళ్ల తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దేశ విభజన సమయంలో అమర్ జిత్ సింగ్ తల్లిదండ్రులు పాకిస్థాన్ వెళ్లిపోయారు. అమర్ ఓ సిక్కు కుటుంబంలో భారత్ లో పెరిగారు. పాక్ లో సింగ్ తల్లిదండ్రులకు ఓ పాప పుట్టింది. అప్పటి నుంచి ఆమెను సింగ్ చూడలేదు.

Brother meets sister after 75 years: అన్న భారత్ లోని పంజాబ్, జలంధర్ లో ఉంటున్నాడు. చెల్లి పాకిస్థాన్ లో ఉంటోంది. వారిద్దరు 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకుంటామని అనుకోని ఆ అన్నాచెల్లెళ్లు ఇన్నేళ్ల తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దేశ విభజన సమయంలో అమర్ జిత్ సింగ్ తల్లిదండ్రులు పాకిస్థాన్ వెళ్లిపోయారు.

అమర్ జిత్ సింగ్ మరో చెల్లితో కలిసి భారత్ లోనే ఉండిపోయారు. పాక్ లో అతడి తల్లిదండ్రులకు ఓ పాప పుట్టింది. ఆమె పేరు కుల్సూమ్ అక్తర్. అప్పటి నుంచి కుల్సూమ్ అక్తర్ ను అమర్ జిత్ సింగ్ చూడలేదు. తాజాగా, పాకిస్థాన్ లోని తన చెల్లితో మాట్లాడి, తన పెద్ద చెల్లిని తీసుకుని కర్తార్ పూర్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కు వెళ్లారు. అక్కడే వారంతా కలుసుకున్నారు. ప్రస్తుతం అమర్ జిత్ సింగ్ అనారోగ్యం దృష్ట్యా వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.

పాక్ లోని తన సోదరి కుల్సూమ్ అక్తర్ (65)ను చూడడానికి వీసా తీసుకుని జిత్ సింగ్ వాఘా సరిహద్దు గుండా కర్తార్ పూర్ వెళ్లారు. పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ నుంచి కుల్సూమ్ అక్తర్ తన కుమారుడు షహ్జాద్ అహ్మద్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులను తీసుకుని కర్తార్ పూర్ వద్దకు వచ్చింది. అన్నను 75 ఏళ్ల తర్వాత చూసిన కుల్సూమ్ అక్తర్ కన్నీరు ఆపుకోలేకపోయింది.

తన అన్న, సోదరి చనిపోయారని తాను అనుకున్నానని, అయితే, వారు బతికే ఉన్నారని కొంత కాలం క్రితమే ఓ వ్యక్తి ద్వారా తెలిసిందని చెప్పింది. అప్పటి నుంచి వాట్సప్ ద్వారా తన అన్నతో మాట్లాడుతున్నానని వివరించింది. తన తల్లిదండ్రులు ముస్లింలు అని, దేశ విభజన సమయంలో తమను ఇక్కడే వదిలేసి వెళ్లారని, తాను ఓ సిక్కు కుటుంబంలో పెరిగానని అమర్ జిత్ సింగ్ చెప్పారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రశాంత్ కిశోర్ సెటైర్లు

ట్రెండింగ్ వార్తలు