Airbus Between Hyderabad-Singapore : హైదరాబాద్‌-సింగపూర్‌ మధ్య అతిపెద్ద విమాన సర్వీసు

హైదరాబాద్‌-సింగపూర్‌ మధ్య ఎయిర్ బస్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు రాకపోకలు సాగించే ప్రయాణిలకు కోసం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సరికొత్తగా ఏ 350 -900 అతిపెద్ద విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. విమాన సేవలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

airbus between hyderabad-singapore

Airbus Between Hyderabad-Singapore : హైదరాబాద్‌-సింగపూర్‌ మధ్య ఎయిర్ బస్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు రాకపోకలు సాగించే ప్రయాణిలకు కోసం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సరికొత్తగా ఏ 350 -900 అతిపెద్ద విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. విమాన సేవలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎస్‌క్యూ 523 నెంబర్‌ గల విమానం ఈ నెల 30న రాత్రి 11:10 గంటలకు హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు బయలుదేరుతుంది.

అతిపెద్ద బాడీ గల ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 303 సీట్లు ఉండనున్నాయి. వీటిలో ఎకానమీ క్లాస్‌లో 263, బిజినెస్‌ క్లాస్‌ 40 సీట్లు ఉంటాయి. ఇది 15 వేల కిలోల సరుకును మోసుకెళ్లగలదు. ప్రస్తుతానికి సింగపూర్‌ – హైదరాబాద్‌ల మధ్య బోయింగ్‌ 737 – 8 విమానాలను సంస్థ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విమానం సీట్ల సామర్థ్యం ఎకానమీలో 144, బిజినెస్‌క్లాస్‌లో 10 సీట్లతో మొత్తంగా 154 సీట్లు మాత్రమే.

Airbus : 56 విమానాల కొనుగోలు కోసం..ఎయిర్‌బస్ తో కేంద్రం మెగా డీల్

ఇది కేవలం 2,400 కిలోల సరుకును మాత్రమే మోసుకెళ్లగలదు. కొత్తగా ప్రారంభించే ఏ 350 -900 విమానం వారంలో గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఏ 350 ఎయిర్‌క్రాఫ్ట్‌ సేవలను హైదరాబాద్‌ నుంచి ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నామని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ జనరల్‌ మేనేజర్‌ సై యెన్‌ చెన్‌ తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.