New COVID-19 Wave : సింగపూర్‌లో కొత్త కొవిడ్-19 వైరస్ వ్యాప్తి

సింగపూర్ దేశంలో కొత్తగా మరో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల ఎక్కువ మంది ప్రజలు కొవిడ్ బారిన పడుతున్నారు. రోజువారీ కేసులు మూడు వారాల క్రితం 1,000 నమోదు కాగా, గత రెండు వారాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,000కి పెరిగింది....

New COVID-19 Wave

New COVID-19 Wave : సింగపూర్ దేశంలో కొత్తగా మరో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల ఎక్కువ మంది ప్రజలు కొవిడ్ బారిన పడుతున్నారు. రోజువారీ కేసులు మూడు వారాల క్రితం 1,000 నమోదు కాగా, గత రెండు వారాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,000కి పెరిగింది. కొత్త కొవిడ్ వేవ్ ప్రభావం వల్ల ఎక్కువ మంది రోగులు ఆసుపత్రిలో చేరే అవకాశం ఉందని సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ చెప్పారు. అయితే ప్రభుత్వం ఈ కేసుల వ్యాప్తిని ఎండమిక్ డిసీజ్ గా పరిగణిస్తుందని మంత్రి తెలిపారు.

Also Read : Bus crash : మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం..16 మంది మృతి, 29 మందికి గాయాలు

సింగపూర్ దేశంలో ఇటీవల ఈజీ.5, దీని సబ్ వేరియెంట్ హెచ్‌కే.3, ఎక్స్ బీబీ ఓమైక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందుతోంది. మార్చి నుంచి ఏప్రిల్ వరకు సంభవించిన చివరి వేవ్ మాదిరిగా ఎటువంటి సామాజిక ఆంక్షలు విధించే ప్రణాళికలు లేవని మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్‌లో గరిష్ఠ స్థాయిలో, ఇన్‌ఫెక్షన్ల సంఖ్య రోజుకు 4,000 కేసులకు పెరిగింది. మునుపటి కొవిడ్ వేరియెంట్‌లతో పోలిస్తే కొత్త వేరియెంట్‌లు తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉందని సూచించడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

Also Read : TDP : చంద్రబాబుకి బెయిల్ రాకపోతే? 9వ తేదీ తర్వాత తెరపైకి అత్తాకోడళ్లు?

‘‘ఈ కొత్త వేరియంట్‌ల ద్వారా కొవిడ్ సంక్రమిస్తే తీవ్రమైన అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించడంలో ప్రస్తుత వ్యాక్సిన్‌లు బాగా పనిచేస్తాయి’’ అని ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. రాబోయే రోజుల్లో కొవిడ్ కేసులతో ఎక్కువ మంది రోగులు ఆసుపత్రుల్లో చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. సింగపూర్ దేశంలోని సీనియర్ సిటిజన్లు, దీర్ఘకాల వ్యాధులున్న రోగులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు.

Also Read : Hyderabad : కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, భయంతో పరుగులు తీసిన స్థానికులు

వృద్ధులు, రోగాలున్న వారు ఏడాదికి ఒకసారి కరోనా టీకా తీసుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు. కొవిడ్ మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడేందుకు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ టీకా కేంద్రాల్లో ఉచితంగా టీకాలు వేస్తూనే ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ వివరించారు.